PM Modi: ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 17 , 2024 | 01:12 PM
దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు..
న్యూఢిల్లీ, మే 17: దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు సీజ్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. అయితే.. సీబీఐ, ఈడీ సంస్థలు కేవలం విపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయని.. కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆయా పార్టీల నేతలు నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోదీ.. విపక్ష నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలోనే దర్యాప్తు సంస్థలు సమర్థవంతంగా, పూర్తి స్వేచ్ఛాయుతంగా పని చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాదు.. ఈడీ, సీబీఐ స్వాధీనం చేసుకున్నట్ల నోట్లను ఏం చేస్తామనే విషయంపైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రధాని మోదీ.
మా ఆలోచన ఇదే..: ప్రధాని మోదీ
ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోదీ.. సీజ్ చేసిన డబ్బులు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నారని.. వారి సొమ్మునంతా ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు సీజ్ చేస్తున్నాయన్నారు. అయితే, ఇలా సీజ్ చేసిన డబ్బును పేద ప్రజలకు చేర్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకు న్యాయ సలహా కోరామని ప్రధాని మోదీ తెలిపారు. ఆ సలహాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.