Share News

Riyana Raju: చరిత్ర సృష్టించిన రియానా, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి ట్రాన్స్ జెండర్

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:17 PM

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు నియమ, నిబంధనలు ఉన్నాయి. స్వాములు తప్ప ఇతరులు దర్శించుకునేందుకు అవకాశం లేదు. పురుషులు, వృద్ధులు, పిల్లలుకు అవకాశం లేదు. ముఖ్యంగా నెలసరి ఉండే మహిళలను స్వామి వారి ఆలయ పరిసరాల్లోకి కూడా అనుమతించరు.

 Riyana Raju: చరిత్ర సృష్టించిన రియానా, అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు నియమ, నిబంధనలు ఉన్నాయి. స్వాములు తప్ప ఇతరులు దర్శించుకునేందుకు అవకాశం లేదు. పురుషులు, వృద్ధులు, పిల్లలకు అవకాశం లేదు. ముఖ్యంగా నెలసరి ఉండే మహిళలను ఆలయ పరిసరాల్లోకి కూడా అనుమతించరు. రియానా రాజు (Riyana Raju) అనే ట్రాన్స్‌జెండర్ మాత్రం అయ్యప్ప స్వామిని దర్శించుకొని చరిత్ర సృష్టించారు.

అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవాలనేది రియానా (Riyana) కల. ఇప్పటికే 8 సార్లు ప్రయత్నించారు. తొమ్మిదో ప్రయత్నంలో ఈ నెల 5వ తేదీన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తన జన్మ ధన్యం అయ్యిందని చెబుతున్నారు.

దర్శనం సమయంలో అయ్యప్ప సన్నిధి ఆలయ సిబ్బంది, కేరళ పోలీసులు సహకరించారని రియానా (Riyana) వివరించారు. తనతోపాటు మరో నలుగురు ట్రాన్స్ జెండర్లు వచ్చారని పేర్కొన్నారు. వారు తమ వివరాలు తెలియజేసేందుకు నిరాకరించారని ఆమె చెప్పారు. స్త్రీల నుంచి పురుషులుగా మారిన ట్రాన్స్‌జెండర్లు ధోతి, ఫైజామా వేసుకుని అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. పురుషుడు అయి ఉండి తాను స్త్రీగా మారానని రియానా చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి అఫిడవిట్లను ఆలయ సిబ్బందికి సమర్పించానని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 03:37 PM