Share News

China Gaming Apps: ఆన్ లైన్ గేమ్ యాప్స్ ద్వారా భారీగా నగదు మళ్లింపు

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:28 PM

ఆన్ లైన్ లోన్ యాప్సే కాదు.. గేమింగ్ యాప్స్ ద్వారా డ్రాగన్ చైనా పెద్ద కుట్ర పన్నింది. భారత దేశం నుంచి రూ.400 కోట్ల నగదును గేమింగ్ యాప్ FIEWINతో స్వాధీనం చేసుకుంది.

China Gaming Apps: ఆన్ లైన్ గేమ్ యాప్స్ ద్వారా భారీగా నగదు మళ్లింపు
China, Used For ₹ 400 Crore Fraud

ఆన్ లైన్ లోన్ యాప్సే కాదు.. గేమింగ్ యాప్స్ ద్వారా డ్రాగన్ చైనా పెద్ద కుట్ర పన్నింది. భారత దేశం నుంచి రూ.400 కోట్ల నగదును గేమింగ్ యాప్ FIEWINతో స్వాధీనం చేసుకుంది. చైనా బండారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టింది. రూ.400 కోట్లలో రూ.25 కోట్లను రికవరీ చేసింది.


నలుగురి అరెస్ట్

గేమింగ్ యాప్‌కు సంబంధించి నలుగురు భారతీయులను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చైనా మూలాలు ఉన్న పౌరులు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారని అధికారులు గుర్తించారు. ముగ్గురు చైనా పౌరులకు చెందిన క్రిప్టో ఖాతాలను స్వాధీనం చేసుకుంది. గేమింగ్ యాప్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసేందుకు కుట్ర పన్నిందని అధికారులు వివరించారు.


cyber crime.jpg


దాడులతో వెలుగులోకి..
గేమింగ్‌ యాప్‌నకు వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలో కొందరు భారతీయులను అదుపులోకి తీసీుకుంది. ఫీవిన్ యాప్ ఆధారిత ఆన్ లైన్ బెట్టింగ్, గేమర్ల నుంచి సేకరించిన డబ్బును కొందరి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. అందుకు ప్రతీగా యాప్ యజమానులు రీఛార్జ్ చేయడానికి కమీషన్ ఇచ్చేవారు. ఒడిశా రూర్కెలాకు చెందిన అరుణ్ సాహు, అలోక్ సాహు రీఛార్జీ చేసే వ్యక్తులుగా పనిచేశారని ఈడీ అధికారులు వెల్లడించారు.


క్రిప్టో కరెన్సీగా మార్పు..

ఫీవిన్ యాప్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లో వచ్చిన డబ్బు క్రిప్టో కరెన్సీగా మార్చారు. ఫీవిన్ యాప్ నుంచి సంపాదించిన క్రిప్టో కరెన్సీని చైనీస్ వ్యక్తుల వాలెట్లలో విదేశీ క్రిప్టో ఎక్స్చేంజ్‌లో జమ చేశారని ఈడీ అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 26 , 2024 | 02:04 PM