Share News

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:14 AM

రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆరోపించారు.

Governor: పీఎంశ్రీ పథకంపై వాగ్యుద్ధం.. అప్పుడు అంగీకరించారు.. ఇప్పుడు వద్దంటున్నారు

- రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ రుసరుసలు

- కడుపుమంటతోనే ఆ విమర్శలు : మంత్రి ఉదయనిధి

చెన్నై: రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు, నాణ్యమైన విద్యనందించేందుకు పీఎంశ్రీ అత్యంత అవసరమంటూ ఈ పథకాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరువాత వ్యతిరేకించడం గర్హనీయమని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గురువారం ఉదయం ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా విద్యాభివృద్ధి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని నిధులు మంజూరు చేస్తున్నదని, పీఎంశ్రీ ద్వారా రాష్ట్రాలకు అదనపు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: CPI(M): సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స


పీఎంశ్రీ పథకాన్ని అమలు చేయడానికి మొదట అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆ పథకమే వద్దని చెబుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 14500 పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ రీతిలోనే రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పీఎంశ్రీ పథకం దోహదపడుతుందన్నారు.


నాణ్యమైన విద్య అందించటం లేదు..

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం లేదని, జాతీయ సగటు విద్యా ప్రమాణాల కంటే రాష్ట్రంలోని విద్యా ప్రమాణాలు తక్కువ స్థాయిలోనే వున్నాయని గవర్నర్‌ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులలో 75 శాతం మంది ద్విసంఖ్యలను కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని, 40 శాతం మంది వారి పాఠ్యాంశాలను చదవలేరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబోధనలోని లోపాలే వీటన్నింటికీ ప్రధాన కారణమని గవర్నర్‌ ధ్వజమెత్తారు. ఈ విద్యార్థులంతా సులువుగా పాస్‌అవుతున్నారని, డిగ్రీలు కూడా పొందగలుతున్నారని, ఈ విధానం దేశానికే ముప్పులాంటిదని విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న మరొక కీలక సమస్య మాదకద్రవ్యాలేనని, పాఠశాలలు, కళాశాలల వద్దే మాదక ద్రవ్యాలను అమ్ముతున్నారని, ఈ సమస్యకు పరిష్కారమేమిటో కనుగొనాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.


ఓర్వలేకే విమర్శలు: మంత్రి ఉదయనిధి

nani1.3.jpg

రాష్ట్ర విద్యావిధానం దేశంలోనే అత్యుత్తమమైనదని, ఈ విషయాన్ని ఓర్వలేక కడుపుమంటతోనే కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారంటూ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు. మరైమలర్‌ నగర్‌లో డీఎంకే నాయకుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ భారతదేశంలోనే నాణ్యమైన విద్యావిధానం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, తమిళ సిలబస్‌ చదివిన వారంతా ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, రాష్ట్ర విద్యావిధానంలో చదివినవారిలో చాలామంది శాస్త్రవేత్తలుగా, వైద్యనిపుణులుగా ఖ్యాతి గడిస్తున్నారని చెప్పారు.


కొంతమంది కడుపుమంటతో ఈ వాస్తవాన్ని అంగీకరించలేక రాష్ట్ర విద్యావిధానంపై పసలేని విమర్శలు చేయడం గర్హనీయమని పరోక్షంగా గవర్నర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర విద్యావిధానాన్ని విమర్శించేవారంతా రాష్ట్రంలోని గురువులందరినీ అవమానించినవారవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యావిధానంలో చదివిన వారే భవిష్యత్తులో ఉన్నతస్థితికి చేరుకుని ఉత్తమ పౌరులుగా ఖ్యాతిగడిస్తారని ఆయన నొక్కివక్కాణించారు.


...............................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................

Minister: ఇండియా కూటమిలోనే డీఎంకే..

- మున్సిపల్‌ శాఖా మంత్రి కేఎన్‌ నెహ్రూ

చెన్నై: కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమిలోనే డీఎంకే కొనసాగాలన్నదే తమ అభిమతమని రాష్ట్ర మున్సిపల్‌ శాఖామంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) మరోమారు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీవో చిదంబరం పిళ్ళై జయంతిని పురస్కరించుకుని, తిరుచ్చి న్యాయస్థానం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కేఎన్‌ నెహ్రూ గురువారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, డీఎంకే తదితర పార్టీలతో కొనసాగుతున్న ఇండియా కూటమికి దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఈ కూటమిలోనే డీఎంకే కొనసాగుతుందన్నారు.

nani2.jpg


ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నేతృత్వంలోని ప్రభుత్వమే భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని మళ్లీ అధికారం చేపడుతుందని, తమ కూటమిలోని నేతలందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, విజయ్‌ మహానాడుకు డీఎంకే ప్రభుత్వం అనుమతులివ్వలేదని తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌(Former Governor of Telangana Tamilisai Soundar Rajan) విమర్శించారని మంత్రిని మీడియా ప్రశ్నించగా ఆమెనే అడగాలంటూ మంత్రి ఏకవచనంతో సంభోదించడం వివాదాస్పదమైంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2024 | 11:14 AM