Punjab: గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన గులాబ్ చంద్
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:41 PM
పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఛండీగఢ్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఛండీగఢ్, జులై 31: పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఛండీగఢ్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
Google Maps: ఈ నగరంలో వాహనంపై వెళ్లడం కంటే.. నడిచి వెళ్లడం ఉత్తమం
Also Read: Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా
స్పందించిన పంజాబ్ కొత్త గవర్నర్..
ఈ సందర్భంగా గవర్నర్ గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ.. ఈ పదవి ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ గవర్నర్‌గా తనను నియమించినందుకు ముందుగా రాష్ట్రపతి ముర్ముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 45 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో తాను ఉన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో ప్రజలకు ధర్మబద్దంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తాను అడుగులు వేస్తానన్నారు. ఎవరైనా వచ్చి.. తనతో మాట్లాడవచ్చని ఈ సందర్భంగా ప్రజలకు కొత్త గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సూచించారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మసులుకుంటానని ఆయన పేర్కొన్నారు.
Also Read: Preeti Sudan: యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రీతి సుదాన్ నియామకం
Also Read:IAS aspirants’ death in Delhi: మృతులు ముగ్గురు కాదు.. 10 నుంచి 12 మంది..
రాజస్థాన్ వాసి: 8 సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ..
పంజాబ్ కొత్త గవర్నర్ గులాబ్ చంద్ కటారియా స్వస్థలం రాజస్థాన్. గతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. అలాగే ఎంపీగా సైతం కటారియా గెలుపొందారు. అయితే ఇంతకుముందు అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా విధులు నిర్వహించారు. ఇటీవల పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆయన పంజాబ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
Also Read: AAP Govt : ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం..!
Also Read: Kerala: ఎర్నాకుళం- బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం..!
గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం భగవంత్ సింగ్ మాన్..
మరోవైపు ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్, ఆయన కేబినెట్ మంత్రులతోపాటు ఉన్నతాధికారుల సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్ కటారియాకు సీఎం భగవంత్ సింగ్ మాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కొత్త గవర్నర్‌తో కలిసి పని చేస్తానని సీఎం స్పష్టం చేశారు. అదే విధంగా గవర్నర్ కటారియా సేవలను రాష్ట్రానికి వినియోగించుకుంటామని సీఎం మాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
Also Read: Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Read More National News and Latest Telugu News