Bengaluru: కూలిన భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద కార్మికులు
ABN , Publish Date - Oct 22 , 2024 | 06:22 PM
బెంగళూరులో వర్షాల దాటికి నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 10 నుంచి 12 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులు పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియరాలేదు.
బెంగళూరు, అక్టోబర్ 22: బెంగళూరులో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర శివారులోని బాబూసాపాల్య ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. పలువురు కార్మికులు భవన నిర్మాణ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ శిథిలాల కింద 17 మంది కార్మికులు చిక్కుకున్నారని నగర పాలక సంస్థ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..
గత మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. దీంతో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం వరకు ఆగకుండా వర్షం కురుస్తుంది. దీంతో 186.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు అయిందని ని భారత వాతావరణ శాఖ తెలిపింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో బెంగళూరులో వర్షం కురవలేదని పేర్కొంది. అయితే 1997లో 178.9 మి. మీ వర్ష పాతం నమోదు అయిందని చెప్పింది. ఆ రికార్డును ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం అధిగమించిందని భారత వాతావరణ శాఖ వివరించింది.
IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు
మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. ఇళ్లలోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లోని సామాగ్రి, వాహనాలు, టీవీ ఫ్రీజ్‌లు అన్నీ నీట మునిగాయి. అలాగే పలు ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బెంగళూరు అభివృధ్ది శాఖను సైతం నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. దుబాయ్, ఢిల్లీలలో ఏమి జరుగుతుందో అంతా మీడియాలో చూశారన్నారు. ఢిల్లీలో కాలుష్యం, దుబాయ్‌లో వర్షాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇది కరువు పీడిత ప్రాంతమని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతిని మనం అడ్డుకోలేమన్నారు. అయితే ఎప్పుడు ఏం జరిగిందనే సమాచారాన్ని అధికారుల బృందం నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.
For National News And Telugu News