Share News

High Court: విపత్తులకు ప్రకృతి కాదు... మనమే కారణం...

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:50 AM

ప్రపంచంలోని పలు ప్రాంతా ల్లో సంభవిస్తున్న విపత్తులకు ప్రకృతిని తప్పుపట్టలేమని, ఆందుకు మనమే కారణమని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. ఊటీ, కొడైకెనాల్‌(Ooty, Kodaikanal) తదితర కొండ ప్రాంతాల్లో వినియోగించి విసిరేస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం కేసులో హైకోర్టు న్యాయమూర్తులు ఈ మేరకు పేర్కొన్నారు.

High Court: విపత్తులకు ప్రకృతి కాదు... మనమే కారణం...

- మద్రాసు హైకోర్టు

చెన్నై: ప్రపంచంలోని పలు ప్రాంతా ల్లో సంభవిస్తున్న విపత్తులకు ప్రకృతిని తప్పుపట్టలేమని, ఆందుకు మనమే కారణమని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. ఊటీ, కొడైకెనాల్‌(Ooty, Kodaikanal) తదితర కొండ ప్రాంతాల్లో వినియోగించి విసిరేస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం కేసులో హైకోర్టు న్యాయమూర్తులు ఈ మేరకు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధానికి సంబంధించి కేసు విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు సతీష్ కుమార్‌, భరత్‌ చక్రవర్తి(Satish Kumar, Bharat Chakravarthy)తో కూడిన ధర్మాసనం, జాతీయ రహదారుల పక్కన టన్నుల కొద్దీ పడిన ప్లాస్టిక్‌ తొలగించవచ్చు కదా అని సలహా ఇచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ప్రపంచంలోనే ‘చికెన్‌ 65’కి మూడో స్థానం


nani5.2.jpg

ప్రపంచంలో పలు ప్రాంతాల్లో విపత్తులు సంభవిస్తున్నాయని, దానికి ప్రకృతి కారణమని చెప్పలేమన్నారు. అందుకు ప్రధాన కారణం మనమేనన్నారు. హక్కుల గురించి మాట్లాడే ప్రజలు, తాము చేయాల్సిన బాధ్యతలపై మాత్రం ఆందోళన చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఈ కేసులో అఫిడివిట్‌ దాఖలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి, విచారణ వాయిదావేశారు.


ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 04 , 2024 | 11:50 AM