Share News

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:28 AM

పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

  • కొత్త బిల్లుకు హిమాచల్‌ అసెంబ్లీ ఆమోదం

  • కాంగ్రె్‌సది రాష్ట్రానికో తీరు: కేటీఆర్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 4: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పింఛన్‌ను రద్దయ్యేలా రూపొందించిన కొత్త బిల్లుకు ఆ రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫిరాయింపు నిరోధక చట్టం(10వ షెడ్యూల్‌) కింద అనర్హత వేటు ఎదుర్కొన్న సభ్యులకు ఈ నిబంధన వర్తిస్తుంది.


హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ(సభ్యుల అలవెన్సులు, పింఛన్లు) సవరణ బిల్లును ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ప్రవేశపెట్టిన బిల్లుకు మెజార్టీ సభ్యులు మూజువాణి ఓటు ద్వారా మద్ధతు తెలిపారు. అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రె్‌సపార్టీ సర్క్‌సఫీట్లు చేస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘‘తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి పార్టీ మారేలా చేయాలి.. అదే హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే... పింఛన్‌ ఇవ్వబోమని చట్టం చేయాలి. ఇదేం వైఖరి’’ అంటూ ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.

Updated Date - Sep 05 , 2024 | 07:11 AM