Share News

PM Modi: తలవంచి క్షమాపణలు చెబుతున్నా.. మోదీ

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:11 PM

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

PM Modi: తలవంచి క్షమాపణలు చెబుతున్నా.. మోదీ

ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై (Shivaji statue collapse) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. దైవం కంటే ఏదీ గొప్పది లేదని తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా మాల్వాన్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పే నైజం విపక్షాలకు లేకున్నా తాను మాత్రం శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.


సింధ్‌దుర్గ్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌లో నేవీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూప్పకూలింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో మోదీ శుక్రవారం పర్యటించారు. ''మాకు ఛత్రపతి శివాజీ అంటే కేవలం ఒక పేరు కాదు, దైవం. మా దైవానికి తలవంచి క్షమాపణ చెప్పుకుంటున్నాను. మాకు భిన్నమైన విలువలు ఉన్నాయి. ఈ గడ్డలో లో పుట్టిన భరతమాత పుత్రుడు వీర సావార్కర్‌ను నిరంతరం అవమానించే కొందరి వ్యక్తుల తరహాలో మేము ఉండం. వాళ్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరు. కోర్టులకు వెళ్లేందుకు, పోరాడేందుకే సిద్ధంగా ఉంటారు'' అని విపక్షాల తీరును మోదీ ఎండగట్టారు.

Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసింది


కాగా, మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పాల్ఘార్‌లోని వాద్వాన్ పోర్ట్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. రూ.76,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రూ.1,560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 05:11 PM