Share News

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

ABN , Publish Date - Jul 01 , 2024 | 01:45 PM

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

న్యూఢిల్లీ, జులై 01: ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసనగా సోమవారం న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.

ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం కోసం.. వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఆపాలని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అయితే అవినీతి చేసిన వారు బీజేపీలో చేరితే.. వారికి అవినీతి చేసుకునేందుకు లైసెన్స్ ఇస్తుందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేత బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు.


ఈ ఏడాది మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో డిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయనకు ట్రయల్ కోర్టు బెయిల్ మంజురు చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఆయన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. జులై 12వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ గత వారం అరెస్ట్ చేసిన విషయం విధితమే.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 02:52 PM