Share News

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

ABN , Publish Date - Jun 01 , 2024 | 07:13 PM

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.

Lok Sabha elections: 'ఇండియా' కూటమికి 295 సీట్లు .. పీపుల్స్ సర్వే ఇదేనన్న ఖర్గే

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. 'ఇండియా' కూటమి పార్టీల నేతలతో శనివారం సమావేశానంతరం వారంతా గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ, తమ కూటమికి 295కి పైగానే సీట్లు వస్తాయని, ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమాచారం, ప్రజల సర్వే ఆధారంగా తాము ఈ విషయం చెబుతున్నామని అన్నారు.


ప్రభుత్వ సర్వేలు, కూటమి ఐక్యతపై...

ప్రభుత్వ సర్వేలపై మాట్లాడుతూ, ప్రభుత్వాలకు సర్వేలు కూడా ఉంటాయని, సర్వేలకు వాళ్లకు (బీజేపీ) చాలా మార్గాలుంటాయని, మీడియా కూడా వారి పాక్షిక సత్యాలను హైలైట్ చేస్తుంటాయని అన్నారు. తమ కూటమి ఐక్యంగా ఉందని, ఇకముందు కూడా ఐక్యత ఇలాగే కొనసాగుతుందని, తమ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరూ చేయలేరని చెప్పారు.

Updated Date - Jun 01 , 2024 | 07:13 PM