Share News

Israel Indian Embasy advisory: భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ

ABN , Publish Date - Aug 02 , 2024 | 08:50 PM

ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్‌ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్‌ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.

Israel Indian Embasy advisory: భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌ (Israel)లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్‌ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్‌ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలి ఖమేనీ ఆదేశాలివ్వడం, ఇజ్రాయెల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ సంస్థ ప్రకటించడంతో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.


''ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌లోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించే సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలి'' అని ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ సమాజిక మాధ్యమం 'ఎక్స్' పోస్టులో పేర్కొంది.

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!


మరోవైపు, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్-ఢిల్లీ మధ్య ఎయిరిండియా విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాతే సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకంటామని తెలిపారు. ఆగస్టు 8 వరకూ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. అవసరమై సమాచారం కోసం 011-69329333, 011-69329999కి కాల్ చేయాలి అని ఎయిర్ ఇండియా యజమాన్యం కోరింది.

For Latest News and National News Click Here

Updated Date - Aug 02 , 2024 | 08:51 PM