Share News

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:41 PM

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా (Express Special) మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్‌ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా (Express Special) మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్‌ ఆర్డినరీ ఛార్జీలను తగ్గించింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మంగళవారం (27/02/24) నుంచే పాత రేట్లు అమల్లోకి వస్తాయి. దీంతో.. సాధారణ ప్రజలకు.. మరీ ముఖ్యంగా రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు, పేద ప్రయాణికులకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది.


కోవిడ్-19 తర్వాత రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను ‘ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్’ లేదా ‘MEMU/DEMU ఎక్స్‌ప్రెస్’ రైళ్లుగా మార్చింది. 200 కిలోమీటర్ల దూరానికి మించి ప్యాసింజర్ రైళ్లను నడవకూడదని భావించిన రైల్వే శాఖ.. క్రమంగా ఆ రైళ్లను ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్స్‌గా మార్చుతూ వచ్చింది. అయితే ఇందులో సేవలు యథాతథంగానే ఉన్నాయి. దీనికితోడు వేగం కూడా పెరగలేదు. కానీ సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలు మాత్రం పెరిగాయి. ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలతో సమానంగా.. కనీస టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.30లకు పెంచారు. దీంతో సాధారణ ప్రజలపై భారం పడినట్టయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చిన తరుణంలో.. రైల్వే బోర్డు ఈ చార్జీలను పునరుద్ధరించి, పాత ఛార్జీలనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున ది చీఫ్‌ బుకింగ్‌ రిజర్వేషన్‌ అధికారులకు సమాచారం అందింది.

ఇలా రైల్వే శాఖ ఇచ్చిన ఆదేశాలతో తిరిగి పాత చార్జీలే అమల్లోకి రావడంతో.. మెయిన్‌లైన్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఎంఈఎంయూ)లో (Mainline Electric Multiple Unit) ఆర్డినరీ క్లాస్‌ టికెట్‌ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. గతంలో ప్యాసింజర్‌ రైళ్లుగా సేవలందించి.. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌గా మారిన రైళ్లన్నింటికీ ఈ మార్పు వర్తిస్తుంది. అన్‌రిజర్వ్‌డ్ ట్రాకింగ్ సిస్టిమ్(యూటీఎస్)లో కూడా వీటి ధరలను అప్‌డేట్ చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 04:49 PM