Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. బయటకు రావొద్దంటూ భారత విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక
ABN , Publish Date - May 18 , 2024 | 11:00 AM
కిర్గిజ్‌స్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని..
కిర్గిజ్‌స్థాన్‌లో (Kyrgyzstan) విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం (Indian Govt) అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను (Indian Student) అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఆ దేశ రాజధాని బిష్కెక్‌లో (Bishkek) విదేశీ విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగిన తరుణంతో.. కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు బారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టింది.
చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!
‘‘మేము భారతీయ విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నాం. వారి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. అయినప్పటికీ.. విద్యార్థులెవరూ బయటకు రావొద్దని సూచించాం. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పాం. మా కాంటాక్ట్ నంబర్ 0555710041. తాము 24X7 అందుబాటులోనే ఉంటాం’’ అని ట్వీట్ చేసింది. అటు.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) కూడా ఈ అల్లర్లపై స్పందించారు. బిష్కెక్‌లో భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఎంబసీతో టచ్‌లో ఉండాలని వారికి సూచించామని తెలిపారు.
వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి వెళ్లనివ్వకుండా..
ఇదిలావుండగా.. కిర్గిజ్‌స్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం.. దాడులకు దారితీసినట్లు ఎంబసీ తెలిపింది. అనంతరం కొన్ని అల్లరి మూకలు బిష్కెక్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ మూక హింసలో.. పాకిస్తాన్‌కు చెందిన పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయని కిర్గిజ్‌స్థాన్‌లోని పాక్ ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. అంతేకాదు.. ముగ్గురు పాక్ విద్యార్థులు మృతి చెందారన్న వార్తలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Read Latest National News and Telugu News