Share News

CSK vs RCB: చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!

ABN , Publish Date - May 18 , 2024 | 09:30 AM

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..

CSK vs RCB: చెన్నైతో మ్యాచ్.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ అద్భుతం జరగాల్సిందే!

ఐపీఎల్-2024 (IPL 2024) ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్క స్థానమే. దాని కోసం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి కూడా వెళ్లనివ్వకుండా..

శనివారం సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్న ఈ రెండు జట్లలో.. ఏదైతే విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే.. రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా బీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. ఆర్సీబీ రన్‌రేట్ 0.387గా ఉంది. అది మెరుగుపడాలంటే, రెండు సమీకరణాలు ఉన్నాయి.


* ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే.. 200 పరుగులకు మించి స్కోరు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క పరుగు తేడాకొట్టినా.. అంటే 17 పరుగులతో విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు చెన్నై ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్‌కి చేరిపోతుంది. ఆర్సీబీ ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.

* ఒకవేళ చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. దాన్ని ఆర్సీబీ 11 బంతులు మిగిలి ఉండగానే ఛేధించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక బంతి తేడాకొట్టినా.. ఆర్సీబీ గెలిచినప్పటికీ ఇంటిబాట పట్టక తప్పదు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని 18.1 బంతుల్లో తప్పకుండా ఛేంజ్ చేయాలి. మరి.. ఆర్సీబీకి ఇది సాధ్యమవుతుందా? లేదా?

అసలేంటీ ‘ప్లాన్-బీ’.. అమిత్ షా ఇచ్చిన సమాధానమేంటి?

ఒక రకంగా చెప్పాలంటే.. ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ చోటు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆర్సీబీతో పోలిస్తే చెన్నైకే ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రెండు సమీకరణాల్ని ఆర్సీబీ అందుకోకపోతే.. చెన్నై ఓడినా సింపుల్‌గా ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోతుంది. ఈ లెక్కన.. అద్భుతం జరిగితే కానీ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరదు. మరి.. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ఎవరెలా రాణిస్తారో చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 18 , 2024 | 09:30 AM