Share News

4న పీఎ్‌సఎల్వీ-సీ59 ప్రయోగం

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:05 AM

ఇస్రో విజయాశ్వం పీఎఎ్‌సఎల్వీ రాకెట్‌ మరో ప్రయోగానికి సిద్ధమైంది.

4న పీఎ్‌సఎల్వీ-సీ59 ప్రయోగం

సూళ్లూరుపేట, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇస్రో విజయాశ్వం పీఎఎ్‌సఎల్వీ రాకెట్‌ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లోని ప్రథమ ప్రయోగవేదిక నుంచి ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4:08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాకెట్‌ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా 550 కిలోల బరువు గల యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎ్‌సఏ)కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

Updated Date - Dec 02 , 2024 | 03:08 AM