BJP : జమిలిపై ముందుకే!
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:31 AM
లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జమిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది.
పార్లమెంటులో 3 బిల్లులు పెట్టనున్న కేంద్రం
వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు
మొదటి దాంతో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు.. రాష్ట్రాల ఆమోదం అక్కర్లే
రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై..
ఎస్‌ఈసీలతో సంప్రదించి ఒకే ఓటరు జాబితా
దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జమిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన సంగ తి తెలిసిందే. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. ‘అపాయింటెండ్ డే (ప్రభుత్వం ప్రా రంభమయ్యే రోజు)’కు సంబంధించి 82ఏ అధికరణ లో కొత్తగా సబ్‌క్లాజ్ (1) చేరుస్తారు. లోక్‌సభ, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల పదవీకాలాన్ని ఒకేసారి ముగించేందుకు 82ఏలోనే సబ్‌క్లాజు (2) జోడిస్తారు. ఇక లోక్‌సభ పదవీకాలం, రద్దుకు సంబంధించి 83(2) అధికరణను సవరించి కొత్తగా సబ్‌క్లాజ్ (3), (4)లను చేరుస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలూ ఇందులో ఉంటాయి.
327అధికరణను సవరించి ‘సమాంతర ఎన్నికలు’ అనే పదబంఽధాన్ని జోడిస్తారు. ఈ బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. దీనిని క్యాబినెట్ ఆమోదించింది. ఇక రెండో రాజ్యాంగ సవరణకు మా త్రం కనీసం సగం రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలకు సంబంధించింది. పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం. లోక్‌సభ/అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమాంతరంగా పంచాయతీరాజ్/పురపాలక, నగరపాలక సంస్థలకూ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల(ఎ్‌సఈసీ)తో కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంప్రదింపులు జరి పి అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. దీనిప్రకారం 324ఏ అధికరణను కొత్తగా చేరుస్తారు. రాజ్యాంగం ప్రకారం ఈసీ, ఎస్‌ఈసీ వేర్వేరు వ్యవస్థలు. ఈసీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తుంది.
ఎస్‌ఈసీ పంచాయతీలు, మునిసిపాలిటీల ఎన్నికల నిర్వహణ బాధ్య త చూస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల నియమ నిబంధనలు కేంద్ర పాలిత ప్రాం తాలైన పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూకశ్మీరు అసెంబ్లీలకు కూడా వర్తించేలా మూడు చట్టాలు.. ఢిల్లీ దేశరాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం (1991), కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం (1963), జమ్మూకశ్మీరు పునర్వ్యవస్థీకరణ (2019) చట్టాలను సవరించాలని మూడో బిల్లులో ప్రతిపాదించనున్నారు. వీటికి సంబంధించిన అధికరణల్లో 12 కొత్త సబ్‌క్లాజులను చేరుస్తారు. రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది. మొదటి దశలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇవి జరిగిన వంద రోజుల్లోపు రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫారసు చేసింది.