Share News

Jharkhand Elections: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర

ABN , Publish Date - Nov 18 , 2024 | 08:29 PM

జార్ఖాండ్‌లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.

Jharkhand Elections: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 13న ముగియగా, తక్కిన 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 23న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇదే రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి.

Yogi Adityanath: బుల్డోజర్ సిద్ధంగా ఉంది.. యోగి నోట మళ్లీ అదేమాట


కూటముల మధ్యే పోటీ

జార్ఖాండ్‌లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' (INDIA) కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం బలహీనంగా ఉండటం జేఎంఎం, ఆర్జేడీకి ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట్లే ప్రధానంగా కాంగ్రెస్ ప్రచారం సాగించింది. కాంగ్రెస్ పార్టీ 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా, మొదటి విడతలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న 7 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం 42 సీట్లలో పోటీ చేస్తుండగా, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్)(ఎల్) 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.


కాగా, కాంగ్రెస్ ఎక్కడైతే అభ్యర్థులను పోటీకి నిలబెట్టిందో అక్కడ కూడా తూతూ మంత్రంగానే ఆ పార్టీ ప్రచారం సాగించినట్టు ఆ కూటమి భాగస్వాముల నుంచే వినిపిస్తోంది. నవంబర్ 13వ తేదీ పోలింగ్‌కు ఒకరోజు ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. పోలింగ్‌కు 48 గంటల ముందు 'సైలెన్స్ పీరియడ్' ఉంటుందని, ఆసమయంలో ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తారంటూ బీజేపీ ప్రశ్నించింది.


రాహుల్ ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారంటే..

జేఎంఎం నేతలు హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ కలిసి జార్ఖాండ్‌లో 60 ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం వరకూ 7 ర్యాలీల్లో పాల్గొన్నారు. మరో నాలుగు సభల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. సీట్ల షేరింగ్ ఒప్పందం ప్రకారం చూసుకున్నా కాంగ్రెస్ నేతలు మరిన్ని ర్యాలీల్లో పాల్గొని ఉండాల్సిందని, తమకున్న బలానికి తగ్గట్టుగానైనా ప్రచారం చేయకుండే మరిన్ని ఎక్కువ సీట్లు ఎలా ఆశించగలుగుతారని జేఎంఎం నేత ఒకరు వ్యాఖ్యానించారు.


గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్నెన్ని?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందింది. జార్ఖాండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 3 సీట్లు, ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ రెండు సీట్లు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి...

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..

Updated Date - Nov 18 , 2024 | 08:32 PM