Share News

Joe Biden: ఇటలీలో అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు.. జో బైడెన్ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:52 PM

ఇటలీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్‌కు పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

Joe Biden: ఇటలీలో అమెరికా అధ్యక్షుడు ఎందుకలా చేశారు.. జో బైడెన్ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్!
Joe Biden

ఇటలీ (Italy) వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్‌కు (G7 Summit) పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియాలో బైడెన్ ప్రవర్తనపై చర్చ జరుగుతోంది. 81 ఏళ్ల బైడెన్ ఆరోగ్యంపై చాలా మంది ఆందోళనలు లేవనెత్తుతున్నారు (Joe Biden Behaviour).


ఇటలీ తీర ప్రాంత నగరమైన అపూలియాలో రెండ్రోజుల పాటు జీ-7 సదస్సు జరగబోతోంది. ఈ సదస్సు కోసం జీ-7 సభ్య దేశాలన్నీ హాజరయ్యారు. భారత్ సభ్య దేశం కాకపోయినా ఇటలీ ప్రధాని ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ (PM Modi) గురువారమే ఇటలీ చేరుకున్నారు. కాగా, అపూలియాలో జీ-7కి వచ్చిన అధినేతలందరూ గ్రూప్ ఫొటోకు ఫోజిలిచ్చారు. ఆ సమయంలో బైడెన్ అక్కడ ఉండకుండా ఎటువైపో చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. వేరెవరితోనో మాట్లాడుతూ కనిపించారు.


బైడెన్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) వెళ్లి బైడెన్ చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఫొటో దిగారు. తన వింత ప్రవర్తనతో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో కూడా బైడెన్ ఇలాగే వింతగా ప్రవర్తించారు. సెనెట్ మెజార్టీ లీడర్ చక్ షూమర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి చేయి అలాగే ముందుకు చాచి ఉండిపోయారు. ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jun 14 , 2024 | 12:52 PM