Share News

Joe Biden: కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్.. ఐసోలేషన్ తర్వాత తొలిసారి వైట్‌హౌస్‌కు వచ్చిన అధ్యక్షుడు!

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:49 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగడమే కాకుండా, కోవిడ్ బారిన కూడా పడిన జో బైడెన్ వారం రోజుల తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌కు చేరుకున్నారు.

Joe Biden: కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్.. ఐసోలేషన్ తర్వాత తొలిసారి వైట్‌హౌస్‌కు వచ్చిన అధ్యక్షుడు!
Joe Biden

అమెరికా అధ్యక్ష ఎన్నికల (US President Election) బరి నుంచి వైదొలగడమే కాకుండా, కోవిడ్ బారిన కూడా పడిన జో బైడెన్ (Joe Biden) వారం రోజుల తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. కోవిడ్ (Covid-19) నుంచి కోలుకున్న బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌కు (White House) చేరుకున్నారు. బైనాక్స్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ రావడంతో బైడెన్ బయటకు వచ్చారు. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడ ధ్రువీకరించారు.


గత బుధవారం బైడెన్‌కు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన డెలావెర్‌లోని తన నివాసానికి వెళ్లి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. క్వారంటైన్‌లో ఉండగానే అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ కమలా హ్యారిస్‌ (Kamala Harris)కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్యం గురించి తీవ్ర వదంతులు వ్యాపించాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని, కోలుకోవడం కష్టమని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్‌లో నిలిచారు. అయితే అవన్నీ వదంతులేనని తాజాగా తేలింది.


కోవిడ్ నుంచి కోలుకుని వైట్‌హౌస్‌కు చేరుకున్న బైడెన్ విలేకరులతో మాట్లాడారు. ``ఎలా ఉన్నారు`` అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ``అంతా బాగానే ఉంది`` అని సమాధానం ఇచ్చారు. అయితే ``అధ్యక్ష రేసు నుంచి ఎందుకు తప్పుకున్నారు``, ``ట్రంప్‌ను ఓడించే సామర్థ్యం కమలా హ్యారిస్‌కు ఉందా`` వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 24 , 2024 | 11:49 AM