Yogi Adityanath: కుటుంబ త్యాగాలు ఖర్గేకు గుర్తులేవా?.. సూటిగా ప్రశ్నించిన యోగి
ABN , Publish Date - Nov 12 , 2024 | 06:30 PM
దేశ భవిష్యత్తును నిర్ణయించే కొన్ని ఎన్నికలు చాలా కీలకమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1946లో కూడా దేశభవిష్యత్తును మార్చే ఎన్నికలు జరిగాయని, అధికారదాహంతో 'ముస్లిం గ్యాంగ్' ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ దేశప్రజలను వంచించిందని, ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు.
ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొందరు సాధువుల వేషంలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారని, వారిలో ముఖ్యమంత్రులైన వారూ కూడా ఉన్నారని పరోక్షంగా యోగిపై ఖర్గే ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్రలోని అమరావతిలో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో విరుచుకుపడ్డారు. సొంత కుటుంబం చేసిన త్యాగాలు ఖర్గే మరిచిపోయారా? అంటూ నిలదీశారు.
Suvendu Adhikari: సువేందు అధికారికి ఇక దేశమంతటా 'జడ్' కేటగిరి భద్రత
''కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నా మీద అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఖర్జేజీ...మీ వయసును నేను గౌరవిస్తున్నాను. మీరు ఆగ్రహించదలిస్తే హైదరాబాద్ నిజాంపై ఆగ్రహించండి. నిజాం రజాకార్లు మీ గ్రామాన్ని తగులబెట్టారు. అత్యంత పాశవికంగా హిందువులను చంపారు. మీ తల్లిగారు, సోదరరి, మీ కుటుంబ సభ్యులను అగ్నికి ఆహుతి చేశారు. ఈ వాస్తవాలు దేశ ప్రజల ముందున్నాయి. ఖర్గేకు కూడా సంఘటన గుర్తుకు ఉంటుంది. అయితే దాని గురించి ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడితే ఓ వర్గం ఓట్లకు కాంగ్రెస్ దూరమవుతుంది. ఓట్ల కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని ఆయన (ఖర్గే) మర్చిపోయారు'' అని యోగి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి అధికార దాహం ఉందని, 'ముస్లిం గ్యాంగ్' ప్రభావం కారణంగానే దేశ విభజనకు ఆ పార్టీ ఒప్పుకుందని యోగి ఆరోపించారు. దేశంలో ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయనీ, అయితే దేశ భవిష్యత్తును నిర్ణయించే కొన్ని ఎన్నికలు చాలా కీలకమని ఆయన అన్నారు. 1946లో కూడా దేశభవిష్యత్తును మార్చే ఎన్నికలు జరిగాయని, అధికారదాహంతో 'ముస్లిం గ్యాంగ్' ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ దేశప్రజలను వంచించిందని, ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసునని చెప్పారు. దేశం ముక్కలైందని, మొదట్నించీ ఒకటిగా ఉన్న ఇండియా విడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నవంబర్ 20న ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
PM Modi: కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు
Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా
For National news And Telugu News