Share News

Kolkata Police : ఆధారాల్ని చెరిపేయలేదు..

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:28 AM

కోల్‌కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.

Kolkata Police : ఆధారాల్ని చెరిపేయలేదు..

కోల్‌కతా, ఆగస్టు 30: కోల్‌కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు. కోల్‌కతా పోలీసుల తరఫున డీసీపీ సెంట్రల్‌ ఇందిరా ముఖర్జీ సుప్రీంకోర్టులో ఈ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వైరలైన ఫొటోలో.. ఘటనాస్థలంలో ఉన్న వారంతా విచారణ బృందానికి సంబంధించిన వారేనని, ఆ చిత్రంలో ఉన్న వారి వివరాలతో సహా వివరించారు.

అంతేకాక, ఆ ఫొటో విచారణ పూర్తయిన తర్వాత ఆగస్టు 9న తీసిన చిత్రమని తెలిపారు. ఇక, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోల్‌కతా పోలీసులు పేర్కొన్న ప్రకారం ఆగస్టు 9న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మృతదేహాన్ని గుర్తించిన ఆస్పత్రి వర్గాలు పోలీసులకు పది గంటల పది నిమిషాలకు సమాచారం అందించాయని తెలిపారు. తొలి ఎఫ్‌ఐఆర్‌ రాత్రి 11:45 గంటలకు నమోదు కావడం మరింత అనుమానం కలిగించే అంశమని పేర్కొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 04:28 AM