Turmeric: దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ పసుపు.. ఫెస్సీ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Nov 09 , 2024 | 10:47 AM
ప్రతిరోజు ఇంట్లో వినియోగించే పసుపు గురించి షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోని పసుపులో సీసం స్థాయి ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
పసుపు ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉపయోగించే మసాలా దినుసు. అయితే పసుపుకు (Turmeric) సంబంధించిన ఒక అధ్యయనంలో ఇటివల షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్, పాకిస్తాన్‌తో సహా భారతదేశంలో విక్రయించే పసుపులో సీసం స్థాయి నియంత్రణ పరిమితి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ ప్రకారం భారతదేశంలోని పాట్నా, పాకిస్తాన్‌లోని కరాచీ, పెషావర్ నుంచి తీసుకున్న పసుపు నమూనాల్లో సీసం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు.
పరిమితి కంటే
గౌహతి, చెన్నైలలో లీడ్ లెవెల్స్ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్దేశించిన నియంత్రణ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2011 ప్రకారం మొత్తం పసుపులో సీసం పరిమితి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ స్థాయిలో సీసం ఉన్న పసుపును తీసుకోవడం వల్ల పిల్లల్లో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సీసం అంటే ఏమిటి?
సీసం ఒక హెవీ మెటల్, దీనిని కాల్షియం అనుకరణ అని పిలుస్తారు. మీరు దీనిని అధికంగా తీసుకుంటే, అది ఎముకలలో పేరుకుపోతుంది. ఇది మనవుల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఇది మీ మెదడు, గుండెకు కూడా ప్రమాదకరం. ఈ సీసం స్థాయి 10 మైక్రోగ్రాములు/గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే పిల్లలకు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది
డిసెంబర్ 2020 నుంచి మార్చి 2021 మధ్య భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లోని 23 ప్రధాన నగరాల నుంచి సేకరించిన పసుపు నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో 14 శాతం పసుపు నమూనాలు 2 మైక్రోగ్రాములు/గ్రాముల కంటే ఎక్కువ సీసం స్థాయిలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి దీనిలో సీసం ఆమోదయోగ్యం కాదని విశ్వసించింది. భారతదేశంలో పాట్నా, గౌహతిలో గరిష్ట స్థాయిలు 274 మైక్రోగ్రాములు/గ్రాములు, 127 మైక్రోగ్రాములు/గ్రాములుగా ఉన్నట్లు గుర్తించారు.
ఆరోగ్యానికి హానికరం
రెండు ప్రాంతాల నుంచి శాంపిల్స్‌ను బీహార్ నుంచి తీసుకొచ్చినట్లు అధ్యయనంలో తేలింది. అదే సమయంలో FSSAI నిబంధనల ప్రకారం పసుపులో సీసం క్రోమేట్, స్టార్చ్, ఇతర రంగులు కూడా వినియోగించకూడదు. పసుపు రంగును ప్రకాశవంతంగా చేయడానికి లెడ్ క్రోమేట్ అనే విష రసాయనాన్ని పసుపులో ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఇది నరాల సమస్యలు, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి:
Rain Alert: నవంబర్ 14 వరకు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అలర్ట్
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News