Share News

Maharashtra Assembly Elections: సీఎం, డిప్యూటీ సీఎం సహా వరుస నామినేషన్లు

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:20 PM

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఓడించగా, మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ (అజిత్ పవార్-యుగేంద్ర పవార్) మధ్య బారామతిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

Maharashtra Assembly Elections: సీఎం, డిప్యూటీ సీఎం సహా వరుస నామినేషన్లు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) నామినేషన్ల పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తదితర ప్రముఖులు సోమవారంనాడు నామినేషన్లు వేశారు. కొప్రి పచ్‌పాఖడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏక్‌నాథ్ షిండే, బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ నామినేషన్ వేశారు. ఆయన మేనల్లుడు, శరద్ పవార్ మనుమడు యుగేంద్ర పవార్ బారామతి నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ-ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఓడించగా, మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ (అజిత్ పవార్-యుగేంద్ర పవార్) మధ్య బారామతిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు


అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ వేయడానికి ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. యుగేంద్ర యాదవ్ పోటీపై మాట్లాడుతూ, పోటీలో ఎవరున్నా ఈసారి కూడా బారామతి ప్రజలు తననే ఎన్నుకుంటారనే నమ్మకం తనకుందన్నారు. కాగా, పోటీ దురదృష్టకరమే అయినా కుటుంబంలోని తామంతా పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌తోనే ఉండాలని నిర్ణయించినట్టు యుగేంద్ర యాదవ్ చెప్పారు. శరద్ పవార్ వల్లే బారామతి సహా చుట్టపక్కల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సొంత మేనమామపైనే పోటీకి దిగడం కష్టమని అనుకోవడం లేదని, అలాగని తేలిగ్గానూ తీసుకోవడం లేదని చెప్పారు. బారామతి ప్రజలు పవార్ సాహెబ్ వెంటే ఉన్నారని, అది లోక్‌సభ ఎన్నికల్లో రుజువైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఆదరణ చూపుతారనే నమ్మకం ఉందని తెలిపారు.


మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు, శివసేన 56, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా, 2014లో బీజేపీ 122 సీట్లు, శివసేన 64, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్‌ మధ్య సీట్ల చిచ్చు!

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 28 , 2024 | 03:22 PM