Share News

NCP MLA Jumped Matralaya: సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 04 , 2024 | 02:44 PM

మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయం వద్ద శుక్రవారంనాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన ఎన్‌సీపీ ) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కిందకు దూకడం కలకలం రేపింది.

NCP MLA Jumped Matralaya: సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే

ముంబై: మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయం (Mantralayam) వద్ద శుక్రవారంనాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన ఎన్‌సీపీ (NCP) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కిందకు దూకడం కలకలం రేపింది. అయితే ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సేఫ్టీ వల (Safety Net)లో వారు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జీర్వాల్‌తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సవ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమతే, హిరిమాన్ ఖోస్కర్, రాజేష్ పటేల్ కూడా సేఫ్టీ నెట్‌లపై దూకిన వారిలో ఉన్నారు. పోలీసులు వారిని బయటకు తెచ్చిన తర్వాత కూడా వారు తన నిరసనను మంత్రాలయ ఆవరణలో కొనసాగించారు.

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి


పంచాయతీల (ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్-పీఈఎస్ఏ) చట్టం 1996 కింద గిరిజనులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని గిరిజన ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. పీఈఎస్ఏలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అక్టోబర్ 2023 నుంచి 17 వివిధ కేటగిరీల్లో గిరిజనుల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను నిలిపి వేశారని వారు తెలిపారు. రెవెన్యూ, ఆరోగ్య శాఖ సహా పలు శాఖల్లో టీచర్లు, ఫారెస్ట్ గార్డు, ఇతర పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుపుతున్నారని, గిరిజనేతరులు ఉద్యోగాల్లో చేరడం, నియామక పత్రాలు అందుకోవడం జరిగినా, పీఈఎస్‌లో రిజర్వ్‌డ్ పోస్టులను ఇంతవరకూ రిక్రూట్ చేయలేదని వారన్నారు. పీఈసీఏ కింద షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులను నియామకాల సస్పెండ్‌కు వ్యతిరేకంగా, ఎస్సీ జాబితాలో ధాంగర్స్‌ను చేర్చడాన్ని నిరసిస్తూ వీరంతా ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతోనే తాము మంత్రాలయ నుంచి కిందకు దూకాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 15 నుంచి 16 మంది గిరిజన ఎమ్మెల్యేలు మంత్రాలయ వద్ద నిరసనల్లో పాల్గొనగా, వారిలో పలువురు అక్కడి నెట్‌లపైకి దూకారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు గిరిజన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే శుక్రవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


For Latest news and National news click here

ఇది కూడా చదవండి...

Minister: ‘ముడా’ వివాదంపై పెదవి విప్పిన మంత్రి.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - Oct 04 , 2024 | 03:09 PM