Maharashtra Elections: 'మహా' సంగ్రామంలో అందరిదృష్టి ఆ 5 నియోజకవర్గాల పైనే
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:06 PM
అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ ఒక 'మినీ' సంగ్రామాన్నే తలపించనుంది. ఆరు ప్రధాన పార్టీలు, ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర, కేంద్ర అగ్రనేతల హోరాహోరీ ప్రచారం ముగిసి 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గాల పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
Maharshtra Elections: 'మహా' పోలింగ్‌కు హాలిడే.. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ క్లోజ్
5 యుద్ధ క్షేత్రాలివే..
1. వర్లి: ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన అభ్యర్థిగా మిలంద్ దేవర పోటీ చేస్తుండగా, ఉద్ధవ్ థాకరే శివసేన తరఫున ఆయన కుమారుడు ఆదిత్య థాకరే బరిలో ఉన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ దేశ్‌పాండే సైతం తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సౌత్ ముంబై మాజీ ఎంపీ అయిన మిలంద్ దేవర అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. యూపీఏ-2 ప్రభుత్వంలో ఆయన సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆదిత్య థాకరే 2019లో ఎన్నికల్లోకి అడుగుపెట్టి వర్లి నియోజకవర్గం నుంచి 89,248 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. కోవిడ్-19 సమయంలోనూ ఆదిత్య అందించిన సేవలకు మంచిపేరు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్ల అడ్మిషన్ వ్యవహారాలను స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ వచ్చాయి. వర్లిలో మహా నవనిర్మాణ సేనకు పెద్దగా ఓటర్ల బలం లేకున్నప్పటకీ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో సందీప్ దేశ్‌పాండేకు మంచి పేరుంది. ముఖ్యంగా మరాఠీ మాట్లాడే ఓటర్లలో ఆయనకు గుర్తింపు ఉంది.
2.బారామతి: పవార్ ఫ్యామిలీ మధ్య పోటీకి ఈ ఏడాది బారామతి మరోసారి కేంద్ర స్థానంగా నిలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఫ్యా్మిలీ బ్యాటిల్ నడిచింది. ఈసారి (అసెంబ్లీ) ఎన్నికల్లో శరద్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను సవాలు చేస్తున్నారు. ఎన్‌పీపీ అభ్యర్థిగా అజిత్ పవార్ బరిలో ఉండగా, ఎన్‌సీపీ(ఎస్‌పీ) అభ్యర్థిగా యుగేంద్ర పవార్ పోటీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలే విజయానికి దన్నుగా నిలిచిన యుగేంద్ర.. శరద్ పవార్ స్థాపించిన విద్యా సంస్థకు ట్రెజరర్‌గా కూడా ఉన్నారు. అజిత్ పవార్ సైతం తక్కువేమీ కాదు. బారామతి నియోజకవర్గం నుంచి 1991 నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచి, ఎలాంటి వివాదాలు లేని నేతగా పేరుతెచ్చుకున్నారు.
3.వాండ్రే ఈస్ట్: వాండ్రే తూర్పు నియోజకవర్గంలోనూ జీషన్ సిద్ధిఖి, వరుణ్ సర్దేశాయ్ మధ్య హోరాహోరా పోరు నెలకొంది. ప్రజాసమస్యలపై చురుకుగా స్పందించడం, సోషల్ మిడియాలో ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించడంలో సిద్ధిఖికి పేరుంది. ఆయనకు యువ ఓటర్లు, ముస్లింల మద్దతు ఉంది. ఆయన తండ్రి, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖి ఇటీవల దుండగుల కాల్పుల్లో మరణించడంతో ఆయనకు సానుభూతి ఓట్లు పడే అవకాశం కూడా ఉందంటున్నారు. మరోవైపు, ఉద్ధవ్ థాకరే మేనల్లుడైన వరుణ్ సర్దేశాయ్ 2022లో పార్టీ చీలినప్పటి నుంచి శివసేన (యూబీటీ)కి వెన్నుదన్నుగా ఉన్నారు. శివసేన సాంప్రదాయ ఓటర్లున్న వాండ్రే తూర్పు నియోజకవర్గంలో ఆయనకు మంచి పలుకుబడి కూడా ఉంది.
4.నాగపూర్ సౌత్ వెస్ట్: ఈ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు గట్టి పట్టుంది. ఈసారి కూడా ఆయన వరుసగా నాలుగోసారి గెలుస్తాననే గట్టి నమ్మకంతో ఉ్ననారు. 2009 నుంచి ఈ నియోజకవర్గానికి ఆయన మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో ఫడ్నవిస్ 49,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల గుడధేకు స్థానికంగా అట్టడుగు స్థాయి నుంచి గట్టి పట్టు ఉంది. బీజేపీ ఆర్థిక విధాలను ఎండగట్టి ఆ పార్టీపైన ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా ఉందని చెబుతుంటారు.
5.కోప్రి-పచ్పఖాడి: థానేలోని కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పోటీలో ఉన్నారు. షిండేకు రాజకీయ గురువైన దివగంత శివసేన నేత ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ డిఘే ఇక్కడ పోటీలో ఉన్నారు. షిండే తరచు ఆనంద్ డిఘేను రాజకీయాల్లో తనకు దిక్యూచిగా చెబుతుంటారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రసాద్ ఓక్ దర్శకత్వంలో మరాఠీ చిత్రం 'ధర్మవీర్ 2'కు షిండే ఫైనాన్స్ కూడా చేశారు. డిఘే జీవిత చరిత్ర ఆధారంగా ఆ చిత్రం రూపొందింది.
ఇవి కూడా చదవండి...
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి
అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్ బిష్ణోయ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..