Share News

Maharashtra election: మహాయుతి ఓటమే మహా వికాస్ అఘాడీ లక్ష్యం

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:25 PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహా వికాస్ అఘాడీలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) నేతలు బుధవారం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు అంశంపై జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మూడు పార్టీలు చెరి సమానంగా సీట్ల పంచుకోనున్నాయి. మిగిలిన స్థానాలను మిగతా మిత్ర పక్షాలకు కేటాయించాలని నిర్ణయించాయి.

Maharashtra election: మహాయుతి ఓటమే మహా వికాస్ అఘాడీ లక్ష్యం

ముంబయి, అక్టోబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) మధ్య సీట్ల సర్దుబాటు అంశం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మూడు పార్టీలు చెరో 85 సీట్ల చొప్పున పంచుకున్నాయి. అంటే ఈ మూడు పార్టీలు 255 అసెంబ్లీ స్థానాల్లో తమ తమ అభ్యర్థులను బరిలో నిలపనున్నాయి.

Also Read:Delhi LG: అనుమతి తీసుకోవాలని తెలియదు


అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. దీంతో మరో 33 స్థానాలు మిగులాయి. వాటిలో మహా వికాస్ అఘడీకి వెనుక ఉండి మద్దతుగా నిలుస్తున్న పార్టీల అభ్యర్థులకు కేటాయించాలని మహా వికాస్ అఘడీ అగ్రనేతలు నిర్ణయించారు. సీట్ల సర్థుబాటు అంశంపై మహా వికాస్ అఘడీలోని భాగస్వామ్య పక్షాల పార్టీల ప్రతినిధులు బుధవారం ముంబయిలో సమావేశమై చర్చించారు. దీంతో ఈ చర్చలు ఫలప్రదమైనాయి.

Also Read: Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..


ఈ సమావేశం అనంతరం శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. నవంబర్ 20వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మొత్తం 288 సీట్లలో 270 స్థానాలపై తమకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. అలాగే తాము సమాజ్ వాదీ పార్టీ, పీడబ్ల్యూపీ, సీపీఐ(ఎం), సీపీఐతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీలను కలుపుకుని ఈ ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇక మిగిలిన సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. మహయుతీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మహా వికాస్ అఘాడీలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి కట్టుగా పని చేస్తాయని ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

Also Read: Ktr: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: కేటీఆర్


మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ ఒకే దశలో జరుగనుంది. నవంబర్ 23వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతన్న ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోరు నెలకొంది.

Also Read: రేగు పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..?


మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), మన్సే, ఆర్‌పీఐ సహా 8 పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉండగా.. ఇక మహాయుతి అఘడి కూటమిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) తదితర పార్టీలు కూటమిగా ఉన్నాయి. అయితే మహారాష్ట్ర ఓటరు ఏ భాగస్వామ్య పక్షానికి పట్టం కడతాడనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

For National News And Telugu News...

Updated Date - Oct 23 , 2024 | 08:25 PM