Accident: మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు బోల్తా
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:29 AM
మహారాష్ట్రలోని గోండియా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 11 మంది ప్రయాణికులు మరణించారు.
11 మంది మృతి
గోండియా, నవంబరు 29: మహారాష్ట్రలోని గోండియా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. దుర్ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. భండారా నుంచి గోందియా జిల్లాకు వస్తున్న బస్సు సడక్ అర్జుని తాలూకాలోని దవ్వ గ్రామం వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందుకు ఆకస్మికంగా ఓ ద్విచక్రవాహనం రావడంతో దానిని ఢీకొట్టకూడదన్న ఉద్దేశంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఆ కారణంగానే ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. బాధితులను వివిధ ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల వంతున ఆర్థిక సాయం ప్రకటించారు.