Mayawati on caste census: కులగణనపై కాంగ్రెస్‌కు క్లాస్..
ABN , Publish Date - Aug 25 , 2024 | 04:39 PM
జాతీయ కుల గణన జరపాలంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న డిమాండ్‌పై బహుజన్ సమాజ్ పార్టీ చీప్ మాయావతి ఆదివారంనాడు క్లాస్ తీసుకున్నారు. మీ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: జాతీయ కుల గణన (National caste census) జరపాలంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న డిమాండ్‌పై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీప్ మాయావతి (Mayawati)ఆదివారంనాడు క్లాస్ తీసుకున్నారు. మీ (UPA) ప్రభుత్వ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
"బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పుడు కులగణన ఎందుకు చేపట్టలేదు? ఇప్పుడు కులగణన ప్రస్తావన చేస్తున్నారు. దీనికి మీ జవాబు ఏమిటి?. కులగణకు బీఎస్‌పీ ఎప్పుడూ అనుకూలమే. బలహీన వర్గాల ప్రయోజనాల రీత్యా కులగణన బీఎస్‌పీకి చాలా కీలకాంశం'' అని మాయావతి వరుస ట్వీట్లలో స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అనుసరించే వారు కాంగ్రెస్‌ను ఎప్పటికీ గౌరవించరని, అంబేద్కర్ బతికి ఉన్నప్పుడు, మరణాంతరం కూడా ఆయనకు భారతరత్న ఇవ్వలేకపోయారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా 90 శాతం దేశ జనాభా
విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది రిజర్వేషన్ వ్యతిరేక ఆలోచన అని తప్పుపట్టారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ రెండూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమని, భారత్ బంద్‌కు వారు మద్దతివ్వకపోవడమే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వారు వ్యతిరేకమా అనుకూలమా అనేది స్పష్టంగా చెప్పడం లేదని, ఎందుకు ఇంత అయోమయంలో ఉన్నారని నిలదీశారు. అనివార్యత కారణంగానే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు మద్దతుగా ఎస్పీ, కాంగ్రెస్ మాట్లాడుతున్నాయని, ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం నోరు మెదపడటం లేదని అన్నారు. షెడ్యూల్ కులాల సబ్ క్లాసిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పలు దళిత, గిరిజన సంస్థలు ఆగస్టు 21న ఒకరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే.
Read More National News and Latest Telugu News