Iltija Mufti: మెహబూబా ముఫ్తీ కుమార్తె ఓటమి..
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:05 PM
శ్రీగుఫ్వారా – బిజ్బెహరా (Srigufwara – Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు.
ఢిల్లీ: హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్‌లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్, ఇండియా కూటమి.. తరువాతి ట్రెండ్స్‌లో బలహీనపడసాగింది. జమ్మూలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. హరియాణాలో వెనకబడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. హరియాణాలో బీజేపీ 40కిపైగా స్థానాల్లో, కాంగ్రెస్ 30కిపైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి. కాగా.. శ్రీగుఫ్వారా – బిజ్బెహరా (Srigufwara – Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ఓటమిని ఆమె అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.