Share News

Minister: విజయ్‌ పార్టీ 6 నెలల్లో మాయం..

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:28 PM

రాష్ట్రంలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్‌(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్‌(Minister Damo Anbarasan) ఎద్దేవా చేశారు.

Minister: విజయ్‌ పార్టీ 6 నెలల్లో మాయం..

- మంత్రి దామో అన్బరసన్‌

చెన్నై: రాష్ట్రంలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్‌(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్‌(Minister Damo Anbarasan) ఎద్దేవా చేశారు. మాడంబాక్కంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. విజయ్‌ నటించిన సినిమా రెండు రోజులకు మించి ప్రదర్శించడం లేదని, అదే విధంగా ఆయన ప్రారంభించిన రాజకీయ పార్టీ కూడా ఆరు నెలల్లోగా పత్తాలేకుండా పోవడం ఖాయమన్నారు. తన సినిమాలకు వస్తున్న జనాన్ని చూసి విజయ్‌ పార్టీ ప్రారంభించారన్నారు. ఆరు నెలల తర్వాత తమిళగ వెట్రికళగం అనే సినీ బాక్స్‌ని లోపల పడేయాల్సిందేనని మంత్రి దామో అన్బరసన్‌ విమర్శించారు.

ఇదికూడా చదవండి: RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు


...........................................................

ఈ వార్తను కూడా చదవండి:

...........................................................

Chennai: పాంబన్‌ రైల్వే వంతెన సిద్ధం.. 2న ప్రధాని చేతులమీదుగా ప్రారంభం

చెన్నై: రామనాథపురం(Ramanathapuram) జిల్లా పాంబన్‌ వద్ద రూ.535 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు ఈ నెలాఖరులో పూర్తికానున్నాయి. దీంతో అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్‌ జలసంధి ప్రాంతంలో పాంబన్‌ రైల్వే వంతెన(Pamban Railway Bridge) ఉంది. రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలిపుతూ 1914లో ఆ రైల్వే వంతెన ప్రారంభించారు. రైల్వే వంతెన దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేలా వంతెన మధ్యలో పట్టాలు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌యంత్రాలు ఏర్పాటు చేశారు. 2.05 కి.మీల. పొడవైన ఈ రైల్వే వంతెన దేశంలోనే అతి పొడవైనదిగా పేరుగడించింది. 1964లో పాంబన్‌ దీవిలో భారీ తుఫాన్‌ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతింది.

nani1.2.jpg


ఆ తర్వాత రైల్వే ఇంజనీరింగ్‌ సాంకేతిక నిపుణులు ఆ వంతెనకు మరమ్మతులు చేశారు. 1988లో పాంబన్‌ రైల్వే వంతెనకు చేరువగా పొడవైన రహదారి వంతెన నిర్మించారు. అప్పటివరకూ మండపం ప్రాంతానికి రామేశ్వరానికి రైల్వే వంతెనే ప్రధాన రహదారిగా ఉండేది. ప్రస్తుతం ఈ రైల్వే వంతెన 110 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తరచూ స్థిరత్వాన్ని కోల్పోతున్నట్లు అధికారులు గమనించారు. రైల్వే వంతెనలో కొన్ని చోట్ల బీటలు వారాయి. ఈ పరిస్థితుల్లో పాత వంతెనకు పక్కనే కొత్తగా రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తొలివిడతగా రూ.250 కోట్లు విడుదల చేసి, 2019 మార్చి ఒకటి ప్రధాన నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఆగస్టు11న భూమి పూజతో పనులు ప్రారంభయ్యాయి.


nani1.jpg

అప్పట్లో 2021 సెప్టెంబర్‌లోగా ఈ కొత్త రైల్వే వంతెన నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాంబన్‌ సముద్ర ప్రాంతంలో తరచూ ఏర్పడే అలల ఉధృతి, తుఫాన్లు తదితర వాతావరణ మార్పులు, ఇవే కాకుండా కరోనా లాక్‌డౌన్‌(Corona Lockdown) తోడవటంతో నిర్దేశిత కాలంలోగా రైల్వే వంతెన పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు ప్రణాళికా వ్యయం కూడా రూ.535 కోట్లకు పెరిగింది. రైల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్థ ఈ రైల్వే వంతెన నిర్మాణ పనులు చేపట్టింది. అదే సమయంలో పాత పాంబన్‌ రైల్వే వంతెనలో నౌకలకు దారివిడిచే ప్రాంతం వద్ద లిఫ్ట్‌ యంత్రాల్లో సాంకేతిక లోసం ఏర్పడటంతో 2023 డిసెంబర్‌ నుంచి రామేశ్వరానికి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రామేశ్వరానికి వెళ్లే రైళ్లన్నింటినీ మండపం, రామనాథపురం వరకు మాత్రమే నడుపుతున్నారు. కొత్తగా నిర్మించిన పాంబన్‌ రైల్వే వంతెన పొడవు 2.078 మీటర్లు.


సముద్రంలో 333 కాంక్రీట్‌ పునాదులు నిర్మించారు. 101 స్తంభాలతో ఈ రైల్వే వంతెన నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఈ కొత్త రైల్వేవంతెనపై ఒకే సారి రెండువైపులా రైళ్లు నడిచేలా డబల్‌ ట్రాక్‌ వేస్తున్నారు. ప్రస్తుతం పట్టాల ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ రైల్వే వంతెన దిగువగా నౌకలు, పడవలు సులువుగా వెళ్లేందుకు వీలుగా వంతెన మధ్యలో 27 మీటర్ల ఎత్తుతో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ యంత్రాలు కూడా అమర్చారు. ఈ రైల్వే వంతెనపై అక్టోబర్‌ 2 నుండి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సింగ్‌ ప్రకటించారు. కాగా అక్టోబర్‌ 2వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఈ రైల్వే వంతెనను ప్రారంభిస్తారని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 12 , 2024 | 01:28 PM