Share News

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. బీజేపీ నేతలకు పచ్చకామెర్లు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:09 AM

హుబ్బళ్ళి వివాదానికి సంబంధించి కేసుల వాపసుపై బీజేపీ ఆందోళనను హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వారికి పచ్చకామెర్లని అందుకే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారన్నారు.

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. బీజేపీ నేతలకు పచ్చకామెర్లు..

- హోంమంత్రి పరమేశ్వర్‌

బెంగళూరు: హుబ్బళ్ళి వివాదానికి సంబంధించి కేసుల వాపసుపై బీజేపీ ఆందోళనను హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వారికి పచ్చకామెర్లని అందుకే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారన్నారు. సోమవారం సదాశివనగర్‌లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ కేసుల వాపసు అనేది ఒక విధానం ఉంటుందని, ఉన్నఫళంగా రద్దు చేయడం అనేది సాధ్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిపైనా కేసులు ఉండేవని ప్రస్తుతం అన్నీ రద్దయ్యాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: కలిసొచ్చే కాలానికి.. అందొచ్చిన కొడుకులు!


వారు చేస్తే సమంజసమని, మేం చేస్తే ఏకపక్షమనేది ఎంతవరకు సమంజసమన్నారు. కేసుల వాపసు నిర్ణయానికి కోర్టు అంగీకరిస్తుందో లేదో... తెలియదన్నారు. కోర్టు అంగీకరిస్తేనే కేసు వాపసు తీసుకుంటామన్నారు. 50 కేసులు ఉన్నాయని, వీటిలో 42 కేసులు మాత్రమే రద్దు చేశామన్నారు. బీజేపీ(BJP)కి ఏ రంగూ కనిపించదని ఎద్దేవా చేశారు. కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress president Mallikarjuna Kharge)కు అనుబంధమైన సిద్దార్థ విహార ట్రస్టు భూమి వాపసు చేసిన అంశమై ఎక్కడ తప్పు జరిగిందని వ్యాఖ్యానించలేదన్నారు. ప్రతీదీ వివాదం చేయరాదన్నారు.


.............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................

Chennai: ‘వందే భారత్‌’లో నాణ్యతలేని ఆహారం..

- సినీ నటుడు పార్తీబన్‌ ఆగ్రహం

చెన్నై: వందే భారత్‌ రైలు(Vande Bharat Train)లో ఆహారం నాణ్యతా రహితంగా వుందని సీనియర్‌ నటుడు పార్తీబన్‌(Senior actor Parthiban) అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తమకు సరఫరా చేసిన ఆహారం రకాలు నాణ్యంగా లేవని, నిష్ప్రయోజనకరంగా ఉన్నాయంటూ పలువురు ప్రయాణికులు కూడా తన వద్ద మొరపెట్టుకున్నారని ఆయన తెలిపారు. తాను తిరుప్పూరు స్టేషన్‌(Tiruppur Station)లోని ఫిర్యాదుల పుస్తకంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆయన తన ఎక్స్‌ పేజీలో ప్రకటించారు.

nani1.jpg


ఆహారాన్ని శుభ్రంగానే వడ్డించారని, రైలు బోగీలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయని, అయితే రాత్రిపూట తనకు ఇచ్చిన ఆహారం, చికెన్‌ నాసికరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై సేలం రైల్వే డివిజన్‌ అధికారులు స్పందిస్తూ... పార్తీబన్‌కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయమై ఆహార కాంట్రాక్టర్‌ నుంచి సంజాయిషీ కోరి తగిన చర్యలు తీసుకుంటామని, ఇకపై నాణ్యమైన ఆహార పదార్ధాలు అందిస్తామని రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు.

nani1.2.jpg


ఇదికూడా చదవండి: Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ఇదికూడా చదవండి: Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ఇదికూడా చదవండి: Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2024 | 11:09 AM