Share News

MK Stalin: ఇలాగే చేస్తే మీరు ఒంటరి అవుతారు.. మోదీపై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:59 PM

కేంద్ర బడ్జెట్-2024లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల విపక్ష చూపించారంటూ విపక్షాల విమర్శల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపితే ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు.

MK Stalin: ఇలాగే చేస్తే మీరు ఒంటరి అవుతారు.. మోదీపై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

చెన్నై: కేంద్ర బడ్జెట్-2024 (Union Budget-2024)లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల విపక్ష చూపించారంటూ విపక్షాల విమర్శల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బుధవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపితే ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎన్నికలు అయిపోయినందున ఇక దేశం గురించి ఆలోచించాలని హితవు పలికారు.


''లోక్‌సభ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి. మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కేవలం మీ ప్రభుత్వాన్ని కాపాడుతుందే కానీ దేశాన్ని కాదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడిపించండి. మిమ్మల్ని ఓడించిన వారిపై ప్రతీకారానికి వెళ్లొద్దు. మీ రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలనుకుంటే ఒంటరిగా మిగిలిపోతారు'' అని స్టాలిన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Nirmala Sitaraman: బడ్జెట్‌పై 'వివక్ష' ముద్ర దారుణం.. మండిపడిన నిర్మలా సీతారామన్


స్టాలిన్‌ నుంచి నేర్చుకోవాలి: మారన్

కాగా, తమ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాటలో ప్రధానమంత్రి నడవాలని, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా ఆయన పాటించాల్సిన సమయం వచ్చిందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు ఓటు వేసిన వారికోసమే కాకుండా ఓటు వేయని వారి కోసం పనిచేస్తానని, అది తన విద్యుక్త ధర్మమని ప్రకటించారని తెలిపారు. ఇందుకు భిన్నంగా ప్రధాని తనకు ఓటు వేయని దూరంగా పెట్టి, తమకు మద్దతిస్తున్న పార్టీల కోసమే పనిచేస్తున్నారని మారన్ ఆరోపించారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 08:59 PM