Share News

MP Kanimozhi: సిలిండర్‌ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్‌

ABN , Publish Date - Mar 10 , 2024 | 11:37 AM

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్‌ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.

MP Kanimozhi: సిలిండర్‌ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్‌

- కనిమొళి

చెన్నై: ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్‌ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సిలిండర్‌ ధర ఎప్పుడో తగ్గించి ఉండొచ్చన్నారు. కానీ, ఎన్నికలు వస్తుండడంతో హడావుడిగా ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించారన్నారు. అది కూడా మహిళా దినోత్సవం రోజునే ప్రకటన వెలువడిందన్నారు. మహిళలకు సిలిండర్‌ ధర మాత్రమే ఆందోళన కలిగిస్తుందా? మహిళలు వంట గదుల్లోనే ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా... ఇలాంటి కల్లబొల్లి తగ్గింపులతో ప్రజలను నమ్మించలేరని ఎంపీ కనిమొళి పేర్కొన్నారు.

Updated Date - Mar 10 , 2024 | 11:37 AM