Share News

MP Kanimozhi: ‘సీఎంగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’.. మోదీపై ఎంపీ కనిమొళి వీడియో వైరల్‌

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:05 PM

‘ముఖ్యమంత్రిగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’ అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) తన ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత నెల 31వ తేది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంటులో తాత్కాలి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

MP Kanimozhi: ‘సీఎంగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’.. మోదీపై ఎంపీ కనిమొళి వీడియో వైరల్‌

చెన్నై: ‘ముఖ్యమంత్రిగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’ అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) తన ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత నెల 31వ తేది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంటులో తాత్కాలి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం తక్కువ నిధులు అందిస్తోందంటూ బుధవారం కర్ణాటక ప్రభుత్వం, గురువారం కేరళ ప్రభుత్వం ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, డీఎంకే ఎంపీలు నల్లచొక్కాలు ధరించి పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మోదీ... అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన దృశ్యాలను తన ఎక్స్‌లో, ‘ఒక కాలంలో ముఖ్యమంత్రి... ప్రస్తుతం ప్రధాని’ అనే కాప్షన్‌ పెట్టి ఎంపీ కనిమొళి పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మోదీ మాట్లాడుతూ... గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రప్రభుత్వానికి రూ.60,000 కోట్లు అందజేస్తోందని, కానీ, కేంద్రం గుజరాత్‌ ఒక్కోసారి, రూ.8 వేలు, రూ.10 వేలు, రూ.12 వేలు అందజేస్తోందని, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని భిక్షగాడుగా భావిస్తున్నారా? కేంద్రప్రభుత్వం నుంచి గుజరాత్‌ రాష్ట్రం నిధుల కోసం అడుక్కోవాలా? అంటూ మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - Feb 10 , 2024 | 12:05 PM