Share News

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో వీరంతా ఔట్.. కొనసాగేది ఎవరంటే..!

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:36 PM

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్‌లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో వీరంతా ఔట్.. కొనసాగేది ఎవరంటే..!
Former Cabinet Ministers

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్‌లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు. అయితే గత మోదీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న కొందరికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కనట్లు తెలుస్తోంది. ఎంపీలుగా గెలిచినా.. వారికి మొదటి విడత మోదీ కేబినెట్‌లో అవకాశం లభించలేదు. గత మోదీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న నిసిత్ ప్రమాణిక్, నారాయణ్ రాణే, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి కీలక నేతలు మోదీ 3.0 కేబినెట్‌ నుంచి ఔట్ అయినట్లు తెలుస్తోంది. కొంతమంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మంత్రి పదవి దక్కకపోగా.. మరికొందరు ఎంపీలుగా గెలిచినా కేబినెట్‌లో చోటు లభించలేదు.


అమేథీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ మోదీ 3.0 నుంచి ఔట్ అయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పురుషోత్తం రూపాలాకు కొత్త ప్రభుత్వంలో చోటు దక్కలేదు. కేరళలోని తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌‌కు గట్టి పోటీ ఇచ్చి ఓటమి చెందిన రాజీవ్ చంద్రశేఖర్‌కు మోదీ కొత్త కేబినెట్‌లో అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఖేరీ లోక్‌సభ స్థానం నుంచి ఓటమిచెందిన అజయ్ మిశ్రా తేనీ, హిమాచల్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అనురాగ్ ఠాకూర్‌‌కు కేంద్రమంత్రి మండలిలో చోటు దక్కనట్లు తెలుస్తోంది.

PM Modi: కొలిక్కి వచ్చిన కేంద్ర మంత్రి మండలి.. మంత్రులకు ప్రధాని తేనీటి సమావేశం


గతంలో మంత్రులుగా ఉండి అవకాశం కోల్పోయినవాళ్లు..

నారాయణ్ రాణే, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహేంద్ర నాథ్ పాండే, అశ్విని కుమార్ చౌబే, వీకే సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంజీవ్ బలియన్, రాజీవ్ చంద్రశేఖర్, దర్శన జర్దోష్, వి మురళీధరన్, మీనాక్షి లేఖి గత మోదీ కేబినెట్‌లో పనిచేశారు. ప్రస్తుతం మోదీ 3.0లో వీరికి అవకాశం దక్కలేదు.


సీనియర్లకు అవకాశం..

తాజా మోదీ కేబినెట్‌లో పలువురు సీనియర్లకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రులు కొందరిని కొత్త కేబినెట్‌లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను మోదీ తన టీమ్‌లో చేర్చుకోవడంతో గత మంత్రివర్గంలోని కొందరు పదవులు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కొందరికి అవకాశం కోల్పోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


కేబినెట్‌లో ఎవరంటే..

జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎస్పీఎస్ బాఘెల్, అన్నపూర్ణా దేవి, వీరేంద్ర కుమార్, పంకజ్ చౌదరి, శోభా కరంద్లాజే, కృష్ణ పాల్ గుర్జార్, ఎల్ మురుగన్ మోదీ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డికి మోదీ కేబినెట్‌లో మరోసారి అవకాశం లభించింది.


Modi 3.0 Cabinet: కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 09 , 2024 | 05:36 PM