Share News

National : హమాస్‌కు భారీ దెబ్బ!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:05 AM

హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్‌ రక్షణలో ఉన్న హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్‌ మిలిటరీ చీఫ్‌, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్‌ డెయిఫ్‌ హతమయ్యాడు.

National : హమాస్‌కు  భారీ దెబ్బ!

  • ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మిలిటరీ చీఫ్‌ డెయిఫ్‌ హతం!

  • జూలై 13న గాజాలో అంతం చేశాం

  • ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం

  • ఆ ప్రకటనను ఖండించిన హమాస్‌

జెరూసలెం, ఆగస్టు 1: హమాస్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇరాన్‌ రక్షణలో ఉన్న హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురైన మరునాడే హమాస్‌ మిలిటరీ చీఫ్‌, ఇజ్రాయెల్‌పై దాడుల వ్యూహకర్త మహమ్మద్‌ డెయిఫ్‌ హతమయ్యాడు.

డెయిఫ్‌ను తమ సైన్యం అంతం చేసినట్టు ఇజ్రాయెల్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. తన ప్రకటనలో ఆపరేషన్‌ వివరాలను వెల్లడించింది. ‘‘మా సైన్యం (ఐడీఎఫ్‌) గత నెల 13న గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంపై జెట్లతో దాడి చేసింది. అక్కడ హమాస్‌కు చెందిన డిప్యూటీ కమాండరు నివాసంలో డెయిఫ్‌ ఉన్నట్టు గుర్తించాం. అక్కడ జెట్లతో బాంబులు ప్రయోగించాం.

ఈ దాడిలో డెయిఫ్‌ హతమయ్యాడు’’ అని ఆ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబరు ఏడున ఇజ్రాయెల్‌ భూభాగంపై జరిగిన దాడుల ఆలోచన, ప్రణాళిక, అమలు అంతా డెయిఫ్‌ నేతృత్వంలో జరిగిందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో 1197 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. కాగా, డెయిఫ్‌ మరణవార్తపై హమాస్‌ స్పందించింది. ఖాన్‌ యూని్‌సపై జూలైలో ఇజ్రాయెల్‌ దాడులు చేసిన మాట నిజమేనని, అందులో 90మంది చనిపోయారని, మృతుల్లో డెయిఫ్‌ లేరని గాజాలోని హమా్‌సకు చెందిన ఆరోగ్య వర్గాలు ధ్రువీకరించాయి.

Updated Date - Aug 02 , 2024 | 04:05 AM