Nitish Kumar: నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని
ABN , Publish Date - Oct 28 , 2024 | 08:39 PM
మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీహార్ పట్ల మోదీ నిరంతరం తన అభిమానాన్ని చాటుకుంటున్నారని నితీష్ ప్రశంసించారు. బీహార్‌కు సాయం పెంచుతూ పోతున్నారని అన్నారు. మోదీ నాలుగోసారి కూడా ప్రధాని అవుతారని తాను ధీమాగా చెప్పగలనని అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే (NDA)లో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kuamr) ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. నాలుగోసారి కూడా మోదీనే ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
TVK Party: మా సిద్ధాంతాలనే కాపీ కొట్టారు, విజయ్ పార్టీపై..
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీహార్ పట్ల మోదీ నిరంతరం తన అభిమానాన్ని చాటుకుంటున్నారని నితీష్ ప్రశంసించారు. బీహార్‌కు సాయం పెంచుతూ పోతున్నారని అన్నారు. మోదీ నాలుగోసారి కూడా ప్రధాని అవుతారని తాను ధీమాగా చెప్పగలనని అన్నారు. అందుకు జేడీయూ పార్టీ సభ్యులందరూ కట్టుబడి ఉండాలని కోరారు.
బీజేపీతో 1996 నుంచి తమకు అనుబంధం ఉన్న విషయాన్ని నితీష్ కుమార్ గుర్తుచేస్తూ, పటిష్ట భాగస్వామ్యం కారణంగానే సమర్ధవంతంగా రాష్ట్రానికి సేవలందించ గలిగామని చెప్పారు. అయితే కొందరు భాగస్వామ్య పార్టీల వల్ల తమ కూటమి పలు సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఆర్జేడీతో ఇంతకుముందు పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం వెనుక కొందరు వ్యక్తులుతో పాటు తన మంత్రి విజేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవాలని వారు తనకు సలహా ఇచ్చారనీ, గతంలో కూటమిలు మారడానికి ఇంటర్నల్ డైనమిక్స్ కారణమయ్యాయని అన్నారు. ఏదిఏమైనప్పటికీ మోదీ నాయకత్వం, తమ కూటమికి చారిత్రక ప్రాధాన్యం ఉందని, బీహార్ రాజకీయ ముఖచిత్రంలో వ్యూహాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ తమ పొత్తు పదిలమని నితీష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య సీట్ల చిచ్చు!
Read More National News and Latest Telugu News