Share News

Goyal: జైలులో చనిపోయేందుకు అనుమతివ్వండి.. న్యాయమూర్తి ఎదుట కన్నీటిపర్యంతం..

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:18 AM

కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్లు మోసం చేసిన కేసులో భాగంగా న్యాయమూర్తి ఎదుట విచారణ చేస్తున్న సమయంలో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు

Goyal: జైలులో చనిపోయేందుకు అనుమతివ్వండి.. న్యాయమూర్తి ఎదుట కన్నీటిపర్యంతం..

కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్లు మోసం చేసిన కేసులో భాగంగా న్యాయమూర్తి ఎదుట విచారణ చేస్తున్న సమయంలో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ తీవ్ర భావోద్యేగానికి గురయ్యారు. ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో బతకడం కంటే జైలులోనే చనిపోవడం మంచిదని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్య అనితకు క్యాన్సర్ ముదిరిపోయిందని, తనను ఎంతో మిస్ అవుతున్నట్లు కంటతడి పెట్టారు. బ్యాంకు మోసానికి సంబంధించి.. గతేడాది సెప్టెంబర్ 1న గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణలో భాగంగా ఆయన ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వ్యక్తిగత విచారణ చేసేందుకు అనుమతివ్వాలన్న గోయల్ అభ్యర్థనను న్యాయమూర్తి మన్నించారు.

కోర్టు రికార్డుల ప్రకారం.. గోయల్ చేతులు ముడుచుకుని, వణుకుతూ భావోద్వేగానికి గురయ్యారని నమోదైంది. ఆ పరిస్థితిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, భార్య కుమార్తెలు కూడా అనారోగ్యంతో ఉన్నారని గోయల్ చెప్పారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో నిలబడేందుకూ చాలా కష్టపడ్డారని వివరించారు. తాను చాలా బలహీనంగా మారానని, జేజే ఆస్పత్రికి రిఫర్ చేసినా ప్రయోజనం లేదని న్యాయమూర్తికి తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆస్పత్రికి జైలు సిబ్బంది, ఎస్కార్ట్ మధ్య ఇతర ఖైదీలతో ప్రయాణం చేయలేకపోతున్నట్లు చెప్పారు. వైద్య సేవలూ అరకొరగానే అందుతున్నాయని వాపోయారు.


నన్ను జేజే ఆస్పత్రికి పంపవద్దు. అందుకు బదులుగా జైలులోనే చనిపోవడానికి అనుమతించండి. జీవితంపై ప్రతి ఆశను కోల్పోయాను. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడానికి నా ఆరోగ్యం సహకరించడం లేదని గోయల్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. విచారణ అనంతరం గోయల్ ను ప్రస్తుతం నిస్సహాయంగా వదిలిపెట్టనని, అతని మానసిక, శారీరక ఆరోగ్యానికి సరైన చికిత్స అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.

కాగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు జెట్ ఎయిర్‌వేస్, గోయల్, అతని భార్య అనిత, ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కి చెందిన కొంతమంది మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 10:18 AM