Share News

DMK leader controersy: రాముడి ఉనికికి ఆధారాల్లేవు.. నోరు పారేసుకున్న డీఎంకే మంత్రి

ABN , Publish Date - Aug 03 , 2024 | 07:52 PM

సనాతన ధర్మం పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంలో డీఎంకే నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, తాజాగా మరో డీఎంకే మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ నోరు పారేసుకున్నారు. అసలు రాముడి ఉనికే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

DMK leader controersy: రాముడి ఉనికికి ఆధారాల్లేవు.. నోరు పారేసుకున్న డీఎంకే మంత్రి

చెన్నై: సనాతన ధర్మం పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంలో డీఎంకే నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, తాజాగా మరో డీఎంకే (DMK) మంత్రి ఎస్.ఎస్.శివశంకర్ (SS Shivasankar) నోరు పారేసుకున్నారు. అసలు రాముడి ఉనికే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు ఉన్నాడనటానికి ఆధారాలు లేవన్నారు. ఒకప్పుడు రాజేంద్ర చోళుడు ఉండేవాడని చెప్పడానికి ఆయన హయాంలో నిర్మించిన చెరువులు, ఆలయాలు నిదర్శనంగా నిలుస్తాయని, రాముడు ఉన్నాడనటానికి మాత్రం చరిత్రలో ఎక్కడా సాక్ష్యాలు లేవని అన్నారు. అరియలూరులో రాజేంద్ర చోళ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి శివశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

రాముడి ఉనికే లేదని, అందుకు సాక్ష్యాలు లేవని మంత్రి శివశంకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందూయిజంపై నోరు పారేసుకునే డీఎంకే నేతలకు వేరే వాళ్ల గురించి మాట్లాడేందుకు మాత్రం ధైర్యం సరిపోదని విమర్శించింది. రాముడి ఉనికిపై శివశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయంలో డీఎంకే సహచర మంత్రి ఎస్.రఘుపతి చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయని, ముందు మంత్రులిద్దరూ మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చురకలు వేశారు.

Ayodhya: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ప్రతినిధి బృందం


మంత్రి రఘుపతి ఏమన్నారు?

డీఎంకే న్యాయశాఖ మంత్రి రఘపతి గతవారం రాముడిపై మాట్లాడుతూ, భగవాన్ శ్రీరాముడు సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని, సెక్యులరిజానికి పయనీర్ అని, అందరి పట్ల సమభావం ఆయన ఆదర్శమార్గం అని చెప్పారు. ఇదే విషయాన్ని అన్నామలై ప్రస్తావిస్తూ, డీఎంకే మంత్రులు రఘపతి, శివశంకర్‌లు కలిసి డిబేట్ చేసి రాముడిపై ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందన్నారు. భగవాన్ శ్రీరామ్ గురించి మంత్రి రఘపుతి నుంచి శివశంకర్‌ కనీసం రెండు ముక్కలైనా నేర్చుకుంటారనే నమ్మకం తమకు ఉందన్నారు.

For Latest News and National News Click Here

Updated Date - Aug 03 , 2024 | 07:52 PM