Share News

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:08 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పోలాండ్ (Poland), ఉక్రెయిన్ (Ukraine) దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.


పోలాండ్ పర్యటన హైలైట్స్

ఇండియా, పోలాండ్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు బలం చేకూరుస్తూ పోలాండ్‌లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్‌లో పర్యటించిన భారత ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా డోబ్రో మహరాజ్ మెమోరియల్, కొల్హాపూర్ మెమోరియల్, మోంటే కాస్సినో యుద్ధ స్మారకం సహా పలు మెమోరియల్స్‌ను మోదీ సందర్శించి నివాళులర్పించారు. భారత సంతతి ప్రజలను కలుసుకుని భారతదేశ ప్రగతి, వసుధైక కుటుంబం ఫిలాసఫీపై చర్చించారు. పొలిష్ ప్రధాని డోనాల్డ్ టస్క్‌ను కలుసుకుని, ఇండియా-పోలింగ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు నిర్ణయించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాను కలుసుకున్నారు. పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్‌ సభ్యులు, ఐడియాలజిస్టులను కలుసుకుని సాంస్కృతిక సంబంధాల మెరుగు, పోలాండ్‌లో భారత క్రీడలను ప్రమోట్ చేసే అంశాలపై చర్చించారు.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..


ఉక్రెయిన్ పర్యటన హైలైట్స్

ఉక్రెయిన్‌తో 1992లో దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుచి ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఆగస్టు 23న కివ్‌లో అడుగుపెట్టిన మోదీ అక్కడి 'ఒయాసిస్ ఆఫ్ పీస్' పార్క్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రష్యాతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు జెలెన్‌స్కీతో కలిసి నివాళులు అర్పించారు. బాధితులకు నివాళిగా ఒక ఆటబొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, జెలెన్‌స్కీ పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వ్యవసాయ, మెడికల్ ప్రాడెక్ట్ రెగ్యులేషన్, హ్యుమనటేరియన్ అసిస్టెన్స్, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాల్లో సహకారానికి నిర్ణయించారు. ఉక్రెయిన్ వైద్య అవసరాలకు మద్దతుగా BHISHM క్యూబ్స్ (మెడికల్ కిట్స్)ను జెలెన్‌స్కీకి అందజేసారు. కివ్‌లో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో హిందీ నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులను కలుసుకుని వారితో సంభాషించారు. ఉక్రెయిన్ ప్రజలకు భారతీయ సంస్కృతిని చేరువ చేసే ప్రయత్నాలను అభినందించారు. ఉక్రెయిన్-రష్యా సమస్యలపై పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని, ఇందుకు ఎలాంటి సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీతో జరిపిన సంభాషణల్లో మోదీ భరోసా ఇచ్చారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 03:08 PM