Share News

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:16 AM

నైజీరియాలో ఉంటూ ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్న తెలంగాణ ప్రవాసిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

నైజీరియాలో తెలంగాణ ప్రవాసికి ప్రధాని ప్రశంసలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): నైజీరియాలో ఉంటూ ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్న తెలంగాణ ప్రవాసిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం క్రాంతినగర్‌ గ్రామానికి చెందిన బిర్కూరి ప్రదీప్‌ నైజీరియాలో పని చేస్తున్నారు. ఆయన నైజీరియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువల పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అలాగే ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని కూడా అధిరోహించారు. ప్రదీప్‌ కృషిని గుర్తించిన భారత రాయబార కార్యాలయం.. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అబుజాలో ఆయన చేతుల మీదుగానే సత్కరించింది. ఈ సందర్భంగా కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన క్రమంలో ప్రదీప్‌ ప్రధాని చిత్రపటంతో దిగిన ఫొటోను చూపారు. దీంతో ఆయన్ను అభినందిస్తూ మోదీ దానిపై తన సంతకం చేశారు. బీజేపీ అభిమాని అయిన ప్రదీప్‌.. నైజీరియాలోని తెలుగు ప్రవాసి ప్రముఖుల్లో ఒకరు.

Updated Date - Nov 18 , 2024 | 03:16 AM