PM Modi: కొత్త ఓటర్లకు మోదీ కీలక సందేశం
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:10 AM
2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తొలి దశ పోలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది.
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తొలి దశ పోలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు. ‘‘2024 లోక్సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో భాగంగా వివిధ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తప్పక ఓటు వేయాలి’’ అని మోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
Annamalai: ఈ పార్టీలు ఓట్ల కోసం వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశాయి
మొదటి దశ ఎన్నికలకు వెళ్తున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల తొలి దశలో 35.67 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు, 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 3.51 కోట్ల మంది యువ ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇది కూడా చూడండి:
Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ
మరిన్ని జాతీయ వార్తల కోసం