Share News

PM Modi : పీఎం కిసాన్‌ నిధుల విడుదల రూ. 20వేల కోట్లు

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:57 AM

రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి‘ 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు.

PM Modi : పీఎం కిసాన్‌ నిధుల విడుదల రూ. 20వేల కోట్లు

వారణాసి, జూన్‌ 18: రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి‘ 17వ విడత నిధులను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీంతో సుమారు 9.26 కోట్ల రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున రూ.20వేల కోట్లు జమకానున్నాయి.

మోదీ ఈ నెల 10వ తేదీన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కాగా, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసిలో పర్యటించడం మోదీకి ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగా మాత తనను దత్తత తీసుకుందని, తాను వారణాసి వాసుల్లో ఒకడినయ్యానని అన్నారు. కాశీ విశ్వనాఽథుని ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా, ప్రతి నెల ఆఖరి ఆదివారం రేడియోలో ప్రసారమయ్యే ‘మన్‌ కీ బాత్‌’ జూన్‌ 30 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన మన్‌ కీ బాత్‌ ఈ నెల నుంచి పునఃప్రారంభమవుతుందని, విలువైన సలహాలు, సూచనలు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, జూన్‌ 21న కశ్మీర్‌లోని షేర్‌-ఈ-కశ్మీర్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాలను నిర్వహించనున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 05:57 AM