Share News

NITI Aayog: ప్రధాని అధ్యక్షతన 'నీతి ఆయోగ్' సమావేశం.. ఎజెండా ఏమిటంటే..?

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:08 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 'నీతి ఆయోగ్' 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది.

NITI Aayog: ప్రధాని అధ్యక్షతన 'నీతి ఆయోగ్' సమావేశం.. ఎజెండా ఏమిటంటే..?

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన 'నీతి ఆయోగ్' (NITI Aayog) 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది. ''వికసిత్ భారత్@2047'' (Viksit Bharat@2047) అనే థీమ్‌తో, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. వికసిత్ భారత్ @2047 విజన్ డాక్యుమెంట్ కోసం అప్రోచ్ పేపర్‌పై సమావేశం చర్చిస్తుందని ఆ ప్రకటన తెలిపింది.


కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహాకారాన్ని వేగవంతం చేయడం, గ్రామీణ-పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశించుకుంది. 2047 నాటికి ఈ లక్ష్యం సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొలాబొరేటివ్ అప్రోచ్ ఉండేలా నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చర్చించి, ఈ విజన్ సాకారానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించనుంది. 2023 డిసెంబర్ 27-29 మధ్య జరిగిన 3వ చీఫ్ సెక్రటరీల జాతీయ సదస్సులో చేసిన సిఫారసులపై కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. నాటి సదస్సులో చర్చకు వచ్చిన సైబర్ సెక్యూరిటీ, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్ అండ్ బ్లాంక్స్ ప్రోగ్రామ్, రోల్ ఆఫ్ స్టేట్, ఎఐ ఇన్ గవర్నెన్స్ అంశాలపై కూడా స్పెషల్ సెషన్స్ నిర్వహించనున్నారు.

Mamata Banerjee: నీతి ఆయోగ్‌లో నిలదీస్తా.. ఢిల్లీ బాట పట్టిన మమత


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్ అఫీసియో మెంబర్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గోనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 05:08 PM