Share News

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

ABN , Publish Date - Oct 02 , 2024 | 07:43 PM

మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.

Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి

పాట్నా: గాంధీ జయంతి రోజున 'జన్ సురాజ్ పార్టీ' (Jan Suraaj) Party)ని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి (Manoj Bharti) పేరును ప్రకటించారు. ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎలక్షన్లు 2025 మార్చిలో నిర్వహించేంత వరకూ మనోజ్ భారతి ఆ పదవిలో కొనసాగుతారని తెలిపారు. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, జన్‌ సురాజ్‌‌ను 'జన్ సురాజ్ పార్టీ'గా ఎన్నికల కమిషన్ గుర్తించినట్టు తెలిపారు.

Prashant Kishor: జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్


పదవులు అక్కర్లేదు..

మనోజ్ భారతి నియామకాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రకటిస్తూ, బీహార్‌లో తమ పార్టీ ఏర్పాటైందని, తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని ఇప్పటికే చెప్పానని, తాత్కాలిక రాష్ట్ర అధ్యక్షుడిని దళిత సామాజిక వర్గం నుంచి ఎంచుకున్నామని చెప్పారు. కేవలం దళిత వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణంగా కాకుండా ఆయన సమర్ధతను గుర్తించి ఎంపిక చేసినట్టు తెలిపారు. జన సురాజ్ పార్టీలో పదవులకు కులం ప్రాతిపదిక కాదని, అనుభవం, యోగ్యత ముఖ్యమని చెప్పారు.


మనోజ్ భారతి ఎవరు?

మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో కూడా పనిచేశారు. ఉక్రెయిన్, బెలారస్, తిమోర్-లెస్తే, ఇండోనేషియా సహా పలు దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. విదేశాగం కార్యాలయంలో సెక్రటరీ-అడ్మినిస్టేషన్‌గా పదవి చేపట్టారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 అక్టోబర్ వరకూ ఉక్రెయిన్ రాయబారిగా పనిచేశారు. మయన్మార్, తుర్కియే, నేపాల్, నెథర్లాండ్స్, ఇరాన్‌లో సైతం ఇండియాకు మనోజ్ భారతి ప్రాతినిధ్యం వహించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Updated Date - Oct 02 , 2024 | 07:43 PM