Bhagwant Mann: సీఎంకు లెప్టోస్పిరోసిస్ పాజిటివ్
ABN , Publish Date - Sep 28 , 2024 | 09:22 PM
భగవంత్ మాన్ 'లెప్టోస్పిరోసిస్'తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని మొహలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రధాన అవయవాలు నిలకబడగా పనిచేస్తు్న్నట్టు చెప్పారు.
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) 'లెప్టోస్పిరోసిస్' (Leptospirosis) బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అరుదైన బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ అయిన 'లెప్టోస్పిరోసిస్' ప్రధానంగా కీలకమైన ఊపిరితిత్తులు, మూతప్రిండాలు వంటి అవయాలపై ప్రభావం చూపుతుంది. పరిస్థితి తీవ్రమైన సందర్భాల్లో మరణాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. భగవంత్ మాన్ 'లెప్టోస్పిరోసిస్'తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని మొహలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రధాన అవయవాలు నిలకబడగా పనిచేస్తు్న్నట్టు చెప్పారు. వైద్య చికిత్సకు సీఎం చాలా బాగా స్పందిస్తున్నట్టు 'ఆప్' నేతలు తెలిపారు.
Yogi Adityanath: యోగి సాహెబ్ రామ్ రామ్... ఆసక్తికర విషయం వెల్లడించిన సీఎం
''క్లినికల్ ప్రమాణాల ఆధారంగా మాన్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ట్రీట్‌మెంట్‌కు కూడా బాగా స్పందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కీలక అవయాలన్నీ నిలకడగా పనిచేస్తున్నాయి. ఆసుపత్రిలో చేరినప్పుడు టైఫాయిడ్ జ్వరంగా అనుమానించాం. రక్తపరీక్షల్లో లెప్టోస్పిరోసిస్ పాజిటివ్ అని తేలింది'' అని ఫోర్టిస్ ఆసుపత్రి డైరెక్టర్, కార్డియాలాజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్‌కే జస్వాల్ తెలిపారు. 50 ఏళ్ల భగవంత్ మాన్ గత బుధవారం రాత్రి రొటీన్ వైద్య పరీక్షల కోసం ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరినట్టు సీఎంఓ కార్యాలయం ఇంతకుముందు తెలిపింది.
For National News And Telugu News..
Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన