Share News

Rahul Gandhi Birthday Celebrations: ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ జన్మదిన వేడుకలు.. హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు

ABN , Publish Date - Jun 19 , 2024 | 02:23 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా(Rahul Gandhi Birthday Celebrations) జరిగాయి.

Rahul Gandhi Birthday Celebrations: ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ జన్మదిన వేడుకలు.. హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా(Rahul Gandhi Birthday Celebrations) జరిగాయి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

వారి సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు. ఇందులో పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపారు.


సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

'రాహుల్.. మీ నిబద్ధత, నిజాయతీ, ప్రజలకు మేలు చేయాలన్న మీ తపన ఎంతో మెచ్చుకోదగ్గది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడవడానికి మీరెప్పుడూ ముందుటారు. ఈ మిషన్ ఇలాగే కొనసాగాలి. భిన్నత్వం, సామరస్యం, కరుణ అనేది కాంగ్రెస్ పార్టీ తత్వం. ఇవన్నీ మీ పనుల్లో కనిపిస్తాయి. సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరు పోరాడారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా'అని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

'ప్రియమైన సోదరుడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశ ప్రజల పట్ల మీకున్న అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు నిరంతర పురోగతి సాధిస్తూ.. విజయం మీ కేరాఫ్ కావాలని కోరుకుంటున్నా' అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 'నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ నా స్నేహితుడు, నా తోటి యాత్రికుడు, మార్గదర్శి, తత్వవేత్త, గొప్ప నాయకుడు' అని ప్రియాంక గాంధీ ప్రశంసించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 19 , 2024 | 02:40 PM