Share News

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి కొత్త నివాసం కేటాయింపు

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:08 PM

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్‌లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి కొత్త నివాసం కేటాయింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్‌లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది. ఇంతకుముందు బీజేపీ చిత్రదుర్గ ఎంపీ ఎ.నారాయణస్వామి ఈ బంగ్లాలో ఉండేవారు. 2019లో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు.


రాహుల్ గాంధీ గత ఏడాది పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడి లోక్‌సభలో అనర్హత వేటు పడటంతో 12 తుగ్లక్ రోడ్డులోని నివాసాన్ని ఖాళీ చేశారు. అప్పట్నించి తన తల్లి సోనియాగాంధీ ఉంటున్న 10 జన్‌పథ్‌లోనే ఆమెతో ఉంటున్నారు. కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక కావడంతో క్యాబినెట్ ర్యాంకు హోదా లభించింది. దీంతో సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్-5ని హౌస్ కమిటీ ఆయనకు తాజా ఆఫర్ చేసింది. అయితే రాహుల్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ శుక్రవారంనాడు సునేహ్రి బాగ్‌లోని బంగ్లాను చూసేందుకు శుక్రవారం వచ్చారు.

NITI Aayog: ప్రధాని అధ్యక్షతన 'నీతి ఆయోగ్' సమావేశం.. ఎజెండా ఏమిటంటే..?


కాగా, రాహుల్‌కు కేబినెట్ హోదా ప్రకారం టైప్-8 బంగ్లా ఆఫర్ చేసామని, ఆయన తన సమ్మతి తెలపగానే ఫార్మల్ నోటిఫికేషన్ జారీ అవుతుందని డైరెక్టరేట్ ఆప్ ఎస్టేట్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇంతవరకూ తొమ్మిది మంది మంత్రులకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 09:09 PM