Share News

Rahul Gandhi: ఐఐటీ విద్యార్థుల దుస్థితికి బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వమే కారణం..

ABN , Publish Date - Jul 10 , 2024 | 09:33 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వంతో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, యువత నిరుద్యోగంతో అల్లాడుతోందని విమర్శించారు.

Rahul Gandhi: ఐఐటీ విద్యార్థుల దుస్థితికి బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వమే కారణం..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి బీజేపీ (BJP)పై విరుచుకుపడ్డారు. బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వంతో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, యువత నిరుద్యోగంతో అల్లాడుతోందని విమర్శించారు. తక్కువ ఉద్యోగ నియామకాల కారణంగా 2024లో ఐఐటీ(IIT) లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజనీర్ల వేతనాలు తగ్గాయంటూ మీడియాలో వచ్చిన వార్తలపై రాహుల్ తన వాట్సాప్ ఛానెల్‌లో స్పందించారు.

Ayodhya land Scam: అయోధ్యలో భూ కుంభకోణం.. అఖిలేష్ సంచలన ఆరోపణలు..!


''ఆర్థిక మందగమనం దుష్ప్రభావం ప్రతిష్టాత్మక ఐఐటీ వంటి సంస్థలపై కూడా ఇప్పుడు పడింది. ఐఐటీ ప్లేస్‌మెంట్లు క్రమంగా తగ్గిపోతుండటంతో వార్షిక ప్యాకేజీ తగ్గుతూ అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యువత భవిష్యత్ మరింత అగమ్యగోచరంగా మారుతోంది'' అని రాహుల్ పేర్కొన్నారు. 2022లో శాతం మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందలేకపోయారని, అది ఈ ఏడాది రెట్టింపై 38 శాతానికి చేరిందని అన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల పరిస్థితే ఇలా ఉంటే తక్కిన సంస్థల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. ఇవాళ యువత నిరుద్యోగంతో పూర్తిగా నైతికస్థైర్యం కోల్పోతున్నారని, తల్లిదండ్రులు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ పేరుతో లక్షలు ఖర్చు పెడుతున్నారని, స్టూడెంట్లు హెచ్చు వడ్డీ రేట్లతో రుణాలు తీసుకుని విద్యను అభ్యసించక తప్పడం లేదని అన్నారు. అంత చేసినా ఉద్యోగం లేక, సాధారణ ఆదాయం కూడా రాక వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వమే కారణమని, ఫలితంగా దేశంలోని మెరిట్ యువత భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఆ సంక్షోభం నుంచి కష్టపడి పనిచేసే యువతను బయటపడేసేందుకు మోదీ ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని ఆయన ప్రశ్నించారు. యువత వాణిని విపక్షాలు శక్తివంచన లేకుండా ప్రశ్నిస్తూనే ఉంటాయని, ఈ అన్యాయాలకు ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేస్తామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 09:33 PM